Begin typing your search above and press return to search.

అందాల సిమ్రాన్‌ వయ్యారాలు చూశారా..!

తాజాగా ఈమె షేర్‌ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వయ్యారాలు పోతూ సిమ్రాన్‌ అందాల ఫోటో షూట్‌ను షేర్‌ చేసి ఆకట్టుకుంది.

By:  Tupaki Desk   |   26 May 2025 4:30 PM
అందాల సిమ్రాన్‌ వయ్యారాలు చూశారా..!
X

ఈ నగరానికి ఏమైంది సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గర అయిన ముద్దుగుమ్మ సిమ్రాన్ చౌదరి. 2018లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు మోడలింగ్‌లో మంచి పేరు సొంతం చేసుకుంది. ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2017 గెలుచుకోవడం ద్వారా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. అందంతో పాటు అభినయం ఈ అమ్మడి సొంతం. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో సిమ్రాన్‌కి ఆఫర్లు ఆశించినంతగా రాలేదు. మెయిన్‌ లీడ్ కోసం వెయిట్‌ చేయకుండా వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ వచ్చింది. ఈ అమ్మడు తెలుగులో చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం చిన్న సినిమాలు, కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు కావడం విశేషం.

హైదరాబాద్‌లో పెరిగిన ఈ అమ్మడు డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదివింది. పాఠశాల విద్యను హైదరాబాద్‌లోనే పూర్తి చేసి సెయింట్‌ ప్రావిన్స్ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌ లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. మిస్‌ టాలెంటెడ్‌ టాలీవుడ్‌ మిస్ హైదరాబాద్‌ టైటిల్‌ను గెలుచుకున్న సిమ్రాన్ చౌదరి ఇండస్ట్రీలో మాత్రం ఆశించిన స్థాయిలో ఆఫర్లు సొంతం చేసుకోలేక పోయింది. 2014లో హమ్‌తుమ్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించడం ద్వారా వెండి తెరపై అడుగు పెట్టింది. మొదటి సినిమా తో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయిన ఈమె ఈ నగరానికి ఏమైంది సినిమాలో మాత్రం మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రేక్షకుల్లో నోటెడ్‌ కావడం జరిగింది.

సినిమాల్లో అడపా దడపా కనిపిస్తూ వస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా ఆరున్నర లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈమె రెగ్యులర్‌గా తన అందమైన ఫోటో షూట్‌ ఫోటోలను, వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తద్వారా సినిమాలతోనే కాకుండా ఇలా ఫోటో షూట్స్‌తోనూ గుర్తింపు దక్కించుకుంది. సిమ్రాన్ చౌదరి కెరీర్‌లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి అనే ట్యాగ్‌ లేకున్నా కూడా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు అంటూ ఆమె సన్నిహితులు, ఫాలోవర్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు.

తాజాగా ఈమె షేర్‌ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వయ్యారాలు పోతూ సిమ్రాన్‌ అందాల ఫోటో షూట్‌ను షేర్‌ చేసి ఆకట్టుకుంది. చూపు తిప్పనివ్వని ఈ అమ్మడి ఫోటోలు ఎప్పటిలాగే నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నడుము అందం చూపిస్తూ బ్లూ జీన్స్‌లో మినీ టీ షర్ట్‌ ధరించి సిమ్రాన్ కన్నుల విందు చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఉన్న ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోల కారణంగా అయినా ఇండస్ట్రీలో ఈమె మరింత బిజీ అవుతుందా అనేది చూడాలి.

ఇప్పటి వరకు ఈమె పెద్ద సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోలేక పోయింది. ఒకవేళ సిమ్రాన్‌ కనుక ఒక్క పెద్ద సినిమాలో అవకాశం దక్కించుకుంటే తప్పకుండా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈమె ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారు అంటూ ఉంటారు. మరి ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి.