Begin typing your search above and press return to search.

లేటెస్ట్ ఫోటోషూట్ తో సిమ్రాన్ గ్లామర్ టచ్.. ఆ ఫోజులకే ఫిదా!

సినిమాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గ్లామర్ వలకబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు సినీ భామలు

By:  Tupaki Desk   |   24 April 2026 8:00 PM IST
లేటెస్ట్ ఫోటోషూట్ తో సిమ్రాన్ గ్లామర్ టచ్.. ఆ ఫోజులకే ఫిదా!
X

సినిమాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గ్లామర్ వలకబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు సినీ భామలు.. అటు సినిమాలలో స్టార్స్ కాలేకపోయినా ఇటు సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటున్నారు అనడంలో సందేహం లేదు. అలాంటి వారిలో సిమ్రాన్ చౌదరి కూడా ఒకరి. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంటున్న ఈ చిన్నది తాజాగా మరో లేటెస్ట్ ఔట్ ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సూర్యుడి వెలుతురు తాకుతున్న వేళ గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియా ఫాలోవర్స్ మెప్పించే ప్రయత్నం చేసింది. జుట్టును విరబూసుకొని గ్రీన్ కలర్ సింగిల్ పీస్ ధరించిన ఈమె.. వయ్యారంగా ఫోటోలకు ఫోజులిస్తూ పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి. అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతూ పలురకాల కామెంట్లు చేస్తున్నారు. క్యూటీ ఈజ్ బ్యాక్ అని ఒక అభిమాని కామెంట్ చేస్తే.. మరొకరు ఫెంటాస్టిక్ , గార్జియస్, సో బ్యూటిఫుల్ అంటూ ఇలా మనసుకు అనిపించిన భావాలను కామెంట్ రూపంలో పంచుకుంటున్నారు. ప్రస్తుతం సిమ్రాన్ చౌదరి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.

1996 జూలై 17న హైదరాబాద్ తెలంగాణలో జన్మించిన సిమ్రాన్ చౌదరి హైట్ 5 అడుగుల 8 ఇంచులు.. 12 సంవత్సరాల వయసులోనే నటన రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న ఈమె.. తొలుత కమర్షియల్ యాడ్స్ లో నటించింది. ఆ తర్వాతే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.. 2012లో మిస్ ఆంధ్ర ప్రదేశ్ గా టైటిల్ ను అందుకున్న సిమ్రాన్ చౌదరి.. అదే ఏడాది టాలీవుడ్ మిస్ హైదరాబాదుగా కిరీటాన్ని సొంతం చేసుకుంది. 2017లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ అవార్డులను సైతం సొంతం చేసుకుంది సిమ్రాన్ చౌదరి.

అందం, అభినయంతో ఆకట్టుకునే ఈమె తొలిసారి రామ్ భీమన దర్శకత్వంలో ఆపిల్ స్టూడియోస్ బ్యానర్ పై ఎం శివరామరెడ్డి నిర్మించిన హమ్ తుమ్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. నిఖిల్ చక్రవర్తి , ఐశ్వర్య, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శిల్పా చక్రవర్తి, ఎమ్మెస్ నారాయణ, మనీష్ , సిమ్రాన్ చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తర్వాత 2018లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత బొమ్ బాట్, చెక్ , పాగల్, అధర్వ, ఆ ఒక్కటి అడక్కు, లవ్ మీ, వనవీరా అంటూ పలు చిత్రాలు చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటు సిమ్రాన్ మాత్రం సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ కి మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తోంది.