Begin typing your search above and press return to search.

విశ్వంభరలో ఆ కోలీవుడ్ స్టార్..!

బింబిసారతో సత్తా చాటిన యువ దర్శకుడు వశిష్ట తన సెకండ్ సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 7:22 AM GMT
విశ్వంభరలో ఆ కోలీవుడ్ స్టార్..!
X

బింబిసారతో సత్తా చాటిన యువ దర్శకుడు వశిష్ట తన సెకండ్ సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నాడు. బింబిసారతో కథను హ్యాండిల్ చేసిన విధానం నచ్చడంతో పాటుగా మెగా 156 గా చిరుకి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లారు. యువి క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. విశ్వంభర అంటూ రీసెంట్ గా సినిమా నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది.


ఈ సినిమాలో చిరు క్యారెక్టరైజేషన్ గురించి కొన్ని వార్తలు ఈ మధ్య సూపర్ ఎగ్జైటింగ్ కలిగించగా లేటెస్ట్ గా మెగా 156 లో మిగతా కాస్టింగ్ గురించి వస్తున్న డీటైల్స్ సినిమా రేంజ్ ని మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో కోలీవుడ్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుందని వార్తలు రాగా తెలుగులో ఆమె చేస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్ అందుకోవడంతో.. వరలక్ష్మి ఎంట్రీ మెగా 156కి మంచిదే అని భావిస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా చిరంజీవి విశ్వంభర సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కూడా నటిస్తాడని తెలుస్తుంది. తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న శింబు ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని మెప్పించే సినిమాలను చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం శింబు అక్కడ కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నారు.

విశ్వంభర సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ కి శింభుని తీసుకున్నారట. సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శింబు కనిపిస్తారని టాక్. ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. విశ్వంభర సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తుంది. కొన్నాళ్లుగా చిరంజీవి రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలు చేస్తున్నారని అనుకుంటున్న ఆడియన్స్ కు మెగా 156తో సర్ ప్రైజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సినిమాలో కోలీవుడ్ స్టార్ శింబు కూడా భాగం అవ్వడం సినిమాపై మరింత బజ్ పెంచేస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో చేసిన క్రేజీ ఫాంటసీ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. విశ్వంభర సినిమాను ఆ సినిమాతో పోల్చుతున్నారు మెగా ఫ్యాన్స్. మెగాస్టార్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత 150 మూవీగా ఖైదీ చేయగా ఆ తర్వాత నుంచి ఎక్కువ మాస్ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే చిరు చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ మెగా ఫ్యాన్స్ అందరికి సూపర్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.