Begin typing your search above and press return to search.

కమల్ తో మరో పవర్ఫుల్ స్టార్.. వ్వాటే కాంబో

ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మరో స్టార్ హీరో భాగమయ్యారు. నటుడు శింబు కూడా ఈ మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   27 March 2024 2:45 AM GMT
కమల్ తో మరో పవర్ఫుల్ స్టార్.. వ్వాటే కాంబో
X

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నంకు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. నేషనల్ వైడ్ గా ఆయనకు తిరుగులేని ఇమేజ్ ఉంది. మణిరత్నం కొన్నేళ్లుగా తెరకెక్కించిన సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్లు అవ్వకపోయినా ఆయన క్రేజ్ మాత్రం అలానే ఉంది. ఇటీవల పొన్నియన్ సెల్వన్ మూవీతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారాయన. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా.. సూపర్ వసూళ్లు సాధించి మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

ఈ సినిమా తర్వాత మణిరత్నం.. విలక్షణ నటుడు కమల్ హాసన్ తో థగ్ లైఫ్ మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కమల్, మణిరత్నం చేతులు కలిపారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ త్రిష ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఐశ్వర్యలక్ష్మి, గౌతమ్‌ కార్తీక్‌, జోజు జార్జ్‌, జయం రవి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మరో స్టార్ హీరో భాగమయ్యారు. నటుడు శింబు కూడా ఈ మూవీలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా శింబును థగ్ లైఫ్ మేకర్స్‌.. మూవీ టీమ్ లోకి స్వాగతం పలికారట. శింబు షూటింగ్ పార్ట్ ఏప్రిల్‌ నుంచి మొదలు కానుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో శింబు ఇప్పటికే నటిస్తున్న STR 48 మరింత ఆలస్యం కానుంది.

అయితే ఈ సినిమా నుంచి మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో దుల్కర్ డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కమల్, మణిరత్నంకు కూడా చెప్పారట. ప్రస్తుతం దుల్కర్ పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే దుల్కర్ స్థానంలో శింబును థగ్ లైఫ్ మేకర్స్ రీప్లేస్‌ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక థగ్ లైఫ్ మేకర్స్ ఇటీవల డిజైన్ చేసిన వీడియో.. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందిస్తున్నారు. ఈ మూవీని కమల్ హాసన్‌-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్‌, రెడ్ జియాంట్ మూవీస్‌, మద్రాస్ టాకీస్‌ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.