కోహ్లీ బయోపిక్ లో తమిళ హీరో?
అయితే శింబు ఇప్పుడు తన కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే పాత్ర చేయబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
By: Tupaki Desk | 3 May 2025 3:31 PMసోషల్ మీడియా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో గంటకో కొత్త వార్త ప్రచారంలోకి వస్తోంది. అందులో కొన్ని వార్తలు కేవలం ప్రచారాల వల్ల కూడా నిజమైన సందర్బాలున్నాయి. ఇండస్ట్రీలో కొన్ని అవకాశాలు నటులను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లడానికి సాయపడతాయి. ఆల్రెడీ సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడిగా శింబుకి మంచి పేరుంది.
అయితే శింబు ఇప్పుడు తన కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే పాత్ర చేయబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. రీసెంట్ గా ఓ చిట్ చాట్ లో భాగంగా కోహ్లీ తన ఫేవరెట్ సాంగ్ గా నీ సింగం ధన్ సాంగ్ ని చెప్పిన విషయం తెలిసిందే. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ ను శింబు చేయనున్నాడని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి.
కోహ్లీ మాట్లాడిన ఈ క్లిప్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షేర్ చేయగా, శింబు దానిపై రెస్పాండ్ అవుతూ కృతజ్ఞతతో కూడిన ఎమోజీలతో రీట్వీట్ చేశాడు. ఈ విషయం సినీ మరియు క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు త్వరలోనే నిజమవుతాయని శింబు ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ ఆ వార్తలు నిజమై శింబు కోహ్లీ బయోపిక్ లో నటిస్తే ఆ సినిమా తమిళ చిత్ర పరిశ్రమను కూడా నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయం. అయితే శింబు ఇప్పటికే మణిరత్నంతో కలిసి థగ్ లైఫ్ ను మరియు అశ్వత్ మారిముత్తుతో చేయబోయే సినిమాలతో చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో కోహ్లీ బయోపిక్ చేస్తాడా అని కొందరంటున్నారు.
మరికొందరు మాత్రం కోహ్లీ బయోపిక్ ఛాన్స్ వస్తే ఎవరైనా ఎందుకు వదులుకుంటారని, ఈ బయోపిక్ తెరకెక్కే అనుకూలతను కూడా కాదనలేమని అంటున్నారు. అన్నీ బావుండి కోహ్లీ బయోపిక్ ను శింబు చేస్తే దేశవ్యాప్తంగా శింబుకు క్రేజ్ పెరిగే అవకాశముంటుంది. శింబు ఈ బయోపిక్ చేస్తే అతని కెరీర్ కు ఆ సినిమా మైల్ స్టోన్ గా మారడం ఖాయం.