సంచలన దర్శకుడితో నయా స్టార్!
కోలీవుడ్ స్టార్ శింబు మళ్లీ ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొంత కాలంపాటు అవకాశాలు లేకపోయినా? మళ్లీ కంబ్యాక్ అయి స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు.
By: Tupaki Desk | 30 Jun 2025 10:00 PM ISTకోలీవుడ్ స్టార్ శింబు మళ్లీ ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొంత కాలంపాటు అవకాశాలు లేకపోయినా? మళ్లీ కంబ్యాక్ అయి స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన `థగ్ లైఫ్` లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ తర్వాత బలమైన పాత్ర శింబుది కావడం విశేషం. సినిమా హిట్ అయితే మంచి పేరొచ్చింది.
కానీ ప్లాప్ తో ఆ ఛాన్స్ లేకుండా పోయింది. అయినా నటుడి శింబు బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కమిట్ అయిన కొన్ని ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యం లో తాజాగా శింబు కోసం ఏకంగా కోలీవుడ్ సంచలనం వెట్రిమారన్ రంగంలోకి దిగుతున్నాడు. శింబు హీరోగా వెట్రీమారన్ ఓచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే కథ అని సమాచారం.
ఈ కథకు పొలిటికల్ టచప్ ఉంటుందంటున్నారు. `వడచెన్నై` చిత్రంలో దర్శకుడు అమీర్ పోషించిన రాజన్ వాగైయార్ పాత్రతో కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందిట. `రాజన్ వాగైయార్` అనే టైటిల్ ను పరిశీ లిస్తున్నట్లు సమాచారం. ఇందులో నెల్సన్, వివేక్ కవి ప్రత్యేక పాత్రలో ఆండ్రియో ఓ కీలక పాత్రకు ఎంపికైనట్లు వినిపిస్తుంది. వచ్చే వారంలో సినిమా చెన్నైలో మొదలవుతుందని సమాచారం.
కొంత భాగం షూటింగ్ హైదరాబాద్ లో కూడా ప్లాన్ చేస్తున్నారుట. ఎలాంటి ఫిలింసిటీలు, స్టూడియోల్లో కాకుండా హైదరాబాద్ రియల్ లోకేషన్స్ లోనే కొన్ని సీన్స్ తీయబోతున్నారుట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వెట్రీ మారన్ ఇటీవలే `విడుదలై2` తో మరో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. 18 కెరీర్ లో వెట్రీమారన్ చేసింది చాలా తక్కువ సినిమాలే. కానీ అన్నీ హిట్లే. దర్శకుడిగా ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. తన సినిమాల ద్వారా గొప్ప సందేశాన్ని జనాల్లోకి పంపిస్తారు.
