Begin typing your search above and press return to search.

'ఓజీ' ఐటెం.. ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌!

భారీ అంచనాలు ఉన్న ఓజీ సినిమా కోసం ఐటెం సాంగ్‌ను దర్శకుడు సుజీత్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. ఆ ఐటెం సాంగ్‌ చాలా ప్రత్యేకతలను కలిగి ఉండనుంది.

By:  Tupaki Desk   |   23 May 2025 5:54 AM
ఓజీ ఐటెం.. ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌!
X

పవన్ కళ్యాణ్‌ రాజకీయాలు, పరిపాలనతో బిజీగా ఉండటం వల్ల సినిమాలకు సమయం కేటాయించలేక పోయాడు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. పవన్ ఏడాది కాలం పాటు చాలా బిజీగా ఉంటూ వచ్చారు. ఎట్టకేలకు ఆయన ఫ్యాన్స్‌ కోరుకుంటున్న విధంగా సినిమాలకు సమయం ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. దాదాపు ఐదేళ్లుగా పవన్ ఫ్యాన్స్‌ను ఊరిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేశాడు. సినిమా షూటింగ్‌ పూర్తి అయిందని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూన్‌ 12 వీరమల్లు థియేటర్ల ద్వారా రాబోతున్న విషయం తెల్సిందే.

పవన్‌ కళ్యాణ్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సినిమా 'ఓజీ'. ఈ సినిమాకు సాహో సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి, గత ఏడాదిలోనే సినిమా విడుదల కావాల్సి ఉండగా ముందుగా చెప్పుకున్నట్లు పవన్‌ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనతో బిజీగా ఉండటం వల్ల వీరమల్లు తరహాలోనే ఓజీ సినిమాను పక్కన పెట్టారు. దాంతో ఓజీ సినిమా ను ఎప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్‌ అభిమానుల్లో కొందరు వీరమల్లు కంటే ఓజీ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు.

స్టైలిష్‌ మాఫియా బ్యాక్‌డ్రాప్‌ సినిమాల్లో పవన్ కనిపిస్తే చూడాలని అభిమానులు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి స్టైలిష్‌ మాఫియా మూవీని సాహో సుజీత్‌ తీయగలడని అంతా నమ్ముతున్నారు. అందుకే ఓజీ సినిమాపై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాలు ఉన్న ఓజీ సినిమా కోసం ఐటెం సాంగ్‌ను దర్శకుడు సుజీత్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. ఆ ఐటెం సాంగ్‌ చాలా ప్రత్యేకతలను కలిగి ఉండనుంది. తమన్‌ సంగీతం అందిస్తున్న ఓజీ ఐటెం సాంగ్‌ను తమిళ స్టార్ నటుడు శింబు పాడబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల శింబు హైదరాబాద్‌ ప్రెస్‌ మీట్‌లో ఆ విషయాన్ని దృవీకరించాడు.

తమన్‌ సంగీత సారధ్యంలో శింబు పాడబోతున్న ఓజీ ఐటెం సాంగ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపిస్తుందనే వార్తలు వస్తున్నాయి. అయితే తమన్నాతో పవన్‌ కళ్యాణ్ ఆడిపాడేది అనుమానమే. ఎందుకంటే కథ అనుసారం విలన్‌లతో ఐటెం సాంగ్ ఉంటుందని, కనుక తమన్నా, పవన్‌ కళ్యాణ్ కాంబో డాన్స్‌ మూవ్స్ ఉండక పోవచ్చు అంటూ చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఓజీ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్ కూడా అందుకు సహకరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్‌ వీరమల్లు, ఓజీ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.