టాలెంటెడ్ డైరెక్టర్ల కెరీర్‌ను నాశనం చేస్తున్నాడని హీరోపై ఆరోపణలు
ఈ సినిమాపై శింబు ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకోవడంతో పాటూ కచ్ఛితంగా శింబు49 బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 30 April 2025 12:30 AMమణిరత్నం దర్శకత్వం వహించిన థగ్ లైఫ్ మూవీ కోసం ఎదురుచూస్తోన్న శింబు, దాంతో పాటూ రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో STR49 చేస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో చాలా కాలం తర్వాత సంతానం సపోర్టింగ్ రోల్ లో చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో శింబు సరసన హీరోయిన్ గా కాయదు లోహర్ నటిస్తోంది.
ఈ సినిమాపై శింబు ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకోవడంతో పాటూ కచ్ఛితంగా శింబు49 బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2023లో రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన పార్కింగ్ మూవీ సూపర్ హిట్ గా నిలవడంతో పాటూ ఆ సినిమా ఓటీటీ రిలీజ్ తర్వాత అన్ని భాషల నుంచి ఆయనకు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి.
అయితే కొంతమంది మాత్రం రామ్ కుమార్, శింబుతో వర్క్ చేయడం అతని కెరీర్ పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని అంటున్నారు. శింబు గతంలో త్రిష ఇల్లానా నయనతారతో సూపర్ హిట్ అందుకున్న అధిక్ రవిచంద్రన్ తో అన్బనావన్ అసరధవన్ అడంగాధవన్ (AAA) చేశాడని, కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచిందని, ఇప్పుడు రామ్ కుమార్ కు కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
టాలెంటెడ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తానని వారి కెరీర్లను శింబు నాశనం చేస్తాడని, ఈ విషయంలో పెద్ద చరిత్రే ఉందని నెటిజన్లు శింబుపై కామెంట్స్ చేస్తుండగా, అతని అభిమానులు మాత్రం శింబుని సమర్థిస్తూ శింబు పూర్తిగా మారిపోయాడని, ఇప్పుడు అతని ఫోకస్ మొత్తం యాక్టింగ్ పైనే ఉందని వాదిస్తున్నారు. శింబు వల్ల STR49 కు ఎలాంటి ఇబ్బంది కలగదని, ఆ సినిమా కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.