పెళ్లిపై మౌనం వీడిన శింబు
శింబు ఎక్కడ ఉంటే వివాదం అక్కడ ఉంటుంది. అతడి ఆకతాయి పనులకు చాలా శిక్ష అనుభవించాడు. కథానాయికలతో ప్రేమాయణాలు నడిపిస్తూ, లేదా గాయకుడిగా వివాదాస్పద పాటలతో అతడు ఎప్పుడూ మీడియాలో కావాల్సినంత ప్రచారం పొందాడు.
By: Tupaki Desk | 16 May 2025 2:00 AM ISTశింబు ఎక్కడ ఉంటే వివాదం అక్కడ ఉంటుంది. అతడి ఆకతాయి పనులకు చాలా శిక్ష అనుభవించాడు. కథానాయికలతో ప్రేమాయణాలు నడిపిస్తూ, లేదా గాయకుడిగా వివాదాస్పద పాటలతో అతడు ఎప్పుడూ మీడియాలో కావాల్సినంత ప్రచారం పొందాడు. నటుడు, దర్శకుడు, రచయిత, గాయకుడు .. ఇలా ఆల్ రౌండర్ నైపుణ్యం ఉన్న శింబు కోలీవుడ్ అగ్ర హీరోగా 100కోట్లు అందుకోవాల్సిన రేంజు అతడికి ఉంది. కానీ క్రమశిక్షణారాహిత్యం అతడిని ఎప్పుడూ బ్యాక్ బెంచీ స్టూడెంట్ గా వెనక్కి నెట్టింది. అతడు సమయానికి సెట్స్ కి రావడం లేదని నిర్మాతలు ఆరోపించారు.
కానీ అన్నిటినీ వదిలేసి ఇప్పుడు గురూజీ మణిరత్నం చెప్పిన మాట వింటున్నాడు. నవాబ్, పీఎస్, థగ్ లైఫ్ చిత్రాల్లో శింబు ఎంతో క్రమశిక్షణతో నటించాడని టాక్ ఉంది. ఇటీవల తన జీవితాన్ని మణి సర్ మార్చేసారని కూడా శింబు ఓ ఈవెంట్లో వ్యాఖ్యానించాడు. ఇలాంటి సమయంలో `థగ్ లైఫ్` ప్రచార హంగామా మధ్య వివాహ ప్రణాళికలపై సిలంబరసన్ మౌనం వీడారు.
ఇటీవల ఒక ప్రైవేట్ కళాశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సిలంబరసన్ విద్యార్థులతో ముచ్చటించే క్రమంలో పెళ్ళి గురించి ఒక ప్రశ్న సూటిగా తాకింది. మీరు ఎలాంటి జీవిత భాగస్వామిని ఊహించుకుంటున్నారు అని అడిగినప్పుడు అతడు చిరునవ్వుతో స్పందించాడు. అతడి జవాబు అభిమానుల్లో ఉత్సాహం నింపింది.
తండ్రి టి. రాజేందర్ మార్గదర్శకత్వంలో బాలనటుడిగా కెరీర్‌ను ప్రారంభించి క్రమంగా హీరోగా పరివర్తన చెందిన శింబు, కోలీవుడ్ లో పవర్ ఫుల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే చాలా బ్రేక్ ల కారణంగా అతడికి బ్యాడ్ నేమ్ వచ్చింది. రీఎంట్రీలో మానాడు అతడికి బిగ్ బ్రేక్ నిచ్చింది. ఇటీవల రెండేళ్లుగా సరైన రిలీజ్ లు ఏవీ లేవు. కానీ అతడు నటిస్తున్న ప్రస్తుత చిత్రం థగ్ లైఫ్ చాలా కాలంగా చర్చల్లో నిలుస్తోంది. మణిరత్నం- కమల్ హాసన్‌లతో కలిసి `థగ్ లైఫ్` లో శింబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ జూన్‌లో విడుదల కానుంది.
