కోలీవుడ్ హీరోతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
సౌత్ స్టార్ హీరోల్లో ఒకడిగా శింబు గత కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.
By: Tupaki Desk | 1 Jun 2025 4:04 PM ISTసౌత్ స్టార్ హీరోల్లో ఒకడిగా శింబు గత కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. పలు బ్లాక్ బస్టర్ సినిమాలతో ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శింబు ఆల్రెడీ 47 సినిమాలు చేశాడు. మరో మూడు సినిమాలు త్వరలోనే ఆడియిన్స్ ముందుకు రానున్నాయి. ప్రస్తుతం కమల్ హాసన్ తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ సినిమా చేశాడు.
జూన్ 5న థగ్ లైఫ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. థగ్ లైఫ్ లో శింబు చాలా కీలక పాత్రలో నటించినట్టు ఆల్రెడీ రిలీజైన ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. యాక్టర్ గా శింబు ఎంత మంచి పెర్ఫార్మర్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ శింబు సినిమాల్లో తన యాక్టింగ్ కంటే తన పర్సనల్ లైఫ్ లో వచ్చే రూమర్ల వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.
గత కొన్నాళ్లుగా టాలీవుడ్ హీరోయిన్ తో శింబు రిలేషన్‌లో ఉన్నాడని, త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్త వినిపిస్తుంది. ఆ టాలీవుడ్ హీరోయిన్ మరెవరో కాదు, ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్. గతంలో శింబు తో కలిసి నిధి ఈశ్వరన్ అనే సినిమా చేసింది. ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే వీరిద్దరి మధ్యా ఏర్పడిన స్నేహం ప్రేమగా మారిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అన్నారు.
సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై తాజాగా హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో పాల్గొన్న నిధి అగర్వాల్ స్పందించి వివరణ ఇచ్చింది. సినిమాల్లో నటించే హీరోయిన్ల గురించి చాలా పుకార్లొస్తాయని, మరీ ముఖ్యంగా వారి పర్సనల్ లైఫ్ గురించి అందరూ ఎక్కువగా ఫోకస్ చేస్తారని, ఏది అనిపిస్తే దాన్ని బయటకు అనేస్తారని, ఇదంతా చాలా కామన్ అని, ఎందుకంటే జనాలు నిజాల కంటే రూమర్లపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని, అందుకే తాను వాటిని పెద్దగా పట్టించుకోనని, తన గురించి ఎప్పుడూ ఏదో రూమర్ వినిపిస్తూనే ఉంటుందని నిధి తెలిపింది. నిధి మాటలతో తన పెళ్లిపై అందరికీ ఓ క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న నిధి, వీరమల్లు పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
