Begin typing your search above and press return to search.

నా చీక‌టి జీవితంలో వెలుగులు నింపింది! మ‌నోజ్

ఉస్తాద్ గేమ్ షోలు లాంటివి మ‌నోజ్ ని మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 Dec 2023 5:21 AM GMT
నా చీక‌టి జీవితంలో వెలుగులు నింపింది! మ‌నోజ్
X

మంచు మ‌నోజ్ ఐదేళ్ల గా వెండి తెర‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో మ‌నోజ్ ఈ దూరం పాటించాల్సి వ‌చ్చింది. వృత్తి..వ్య‌క్తిగ‌త విష‌యాల్లోనూ కొంత డిస్ట‌బెన్స్ ఏర్ప‌డింది. దీంతో మ‌నోజ్ తెర‌పై క‌నిపించ‌లేక‌పోయాడు. ఇటీవ‌లే మ‌ళ్లీ కంబ్యాక్ అవుతున్నాడు. ఒక్కో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తు న్నాడు. `అహం బ్ర‌హ్మ‌స్మీ`..`వాట్ ద ఫిష్` చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అలాగే బుల్లితెర వేదిక‌పైనా మెరుస్తు న్నాడు. ఉస్తాద్ గేమ్ షోలు లాంటివి మ‌నోజ్ ని మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తున్నాయి.

ఇక మ‌నోజ్ సినిమాల‌కు గ్యాప్ ఇచ్చినంత క‌లం ఎన్నో సందేహాలు తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వీటికి త‌గ్గ‌ట్లు సోష‌ల్ మీడియాలో ఆయ‌న పోస్టులు సైతం అంతే బ‌లం చేకూర్చాయి. మ‌నోజ్ రాజ‌కీయ ప్ర‌వేశం చేస్తున్నాడ‌ని.. సినిమాలు చేయ‌డ‌ని....వ్యాపార రంగంలో బిజీ అవుతాడని... ఇలా ఎన్నో సందేహాలు ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల్లో ఉన్నాయి. ఇక వాట‌న్నిటికి స‌మాధానం చెప్పే స‌మ‌యం వ‌చ్చేసింది అంటున్నాడు. 2023 క్రిస్మ‌స్ నే అందుకు వేదిక చేసుకున్నాడు.

ఆక‌థా క‌మీమాషు ఏంటో ఆయ‌న‌మాట‌ల్లోనే తెలుసుకుందాం. `ఈ క్రిస్మ‌స్ కి నానుంచి ఓ పెద్ద స‌ర్ ప్రైజ్ రాబోతుంది. నేను..నా భార్య మౌనిక క‌లిసి పిల్ల‌ల‌కు సంబంధించి ఒకటి చేయ‌బోతున్నాం. ముంబైలో దాన్ని ఆవిష్క‌రించ‌బోతున్నాం. దీని కోసమే రిల‌య‌న్స్ తో చేతులు క‌లిపాం. నేను ఇన్నాళ్లు విరామం తీసుకుని ఏం చేశావ్ అని అడిగిన వాళ్ల‌కు అది ఓ స‌మాధానంలా ఉంటుంది. అంద‌రిలో ఉన్న అన్ని ర‌కాల సందేహాలు ఆరోజు క్లారిటీ వ‌చ్చేస్తుంది.

ఇక వ్య‌క్తిగ‌తంగా ఈ విరామం నాకెంతో మేలు చేసింది. ఏడేళ్ల గ్యాప్ లో చాలా కొత్త విష‌యాలు నేర్చుకు న్నా. కానీ మొద‌టి మూడేళ్లు మ‌నోదైర్యాన్ని కోల్పోయాను. చాలా చీక‌టిని చూశాను. అదే స‌మ‌యంలో మౌనిక నా జీవితంలోకి వ‌చ్చి వెలుగు నింపింది. జీవితంపై ఆశ‌ను చిగురింప జేసింది. సినిమాల‌పై నాకున్న ప్రేమ‌ను..న‌న్ను ప్రేమించే అభిమానుల ప్రేమ‌ను అప్పుడే అర్ధం చేసుకోలిగాను` అన్నారు.