సికిందర్ లీక్ వెనుక షాకింగ్ విషయాలు
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా సికిందర్.
By: Tupaki Desk | 3 April 2025 1:38 PM ISTబాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా సికిందర్. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఓ గెస్టు రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈద్ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే ఎవరూ ఊహించని విధంగా సికిందర్ HD వెర్షన్ రిలీజ్ కు ముందే ఆన్‌లైన్ లోకి లీకైన విషయం తెలిసిందే.
అయితే సికిందర్ పైరసీ వెర్షన్ కంటెంట్‌కు, థియేటర్ల వెర్షన్ కంటెంట్ కు చాలా తేడాలున్నాయని తెలుస్తోంది. బాలీవుడ్ కథనాల ప్రకారం లీకైన వెర్షన్, థియేటర్ వెర్షన్ కు చాలా భిన్నంగా ఉందని సమాచారం. ఆ తేడాల్లో కాజల్ సూసైడ్ కు ట్రై చేసే సీన్, రష్మిక చనిపోయాక ఆమె హార్ట్ ను తీసుకునే అమ్మాయితో సల్మాన్ కారులో ఉండే సీన్, ఇంటర్వెల్ కు ముందు సల్మాన్, సత్యరాజ్ మధ్య వచ్చే వార్నింగ్ సీన్ కొంచెం లెంగ్తీగా ఉండటం, సల్మాన్ ఖాన్ డ్యాన్స్ చేసిన అజీబ్ దస్తాన్ సాంగ్ కూడా లేకపోవడం లాంటివి అనుమానాలను మరింత పెంచుతున్నాయి.
దీంతో సికిందర్ లీక్ ఎవరో కావాలనే చేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇది పైరసీ అనడానికి కూడా వీల్లేదు. సినిమా యూనిట్ నుంచి ఎవరో లీక్ చేశారని చెప్పొచ్చు. లీకైన వెర్షన్, థియేటర్ వెర్షన్ మధ్య తేడాలు చూశాక చిత్ర యూనిట్ నుంచే ఎవరో కావాలని లీక్ చేశారనే అనుమానాలు పెరుగుతున్నాయి. అంతేకాదు, రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్ కు సంబంధించిన వ్యక్తులెవరైనా ఈ లీక్ కు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
సెన్సార్ తర్వాత ఫైనల్ థియేట్రికల్ వెర్షన్ ను బెటర్ వెర్షన్ కోసం మళ్లీ ఎడిట్ చేయించారని, ఆ టైమ్ లోనే ఇది జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో అయిందేదో అయిపోయిందిలే ఇంకేం చేస్తాం అనుకోవడానికి లేదు. దీన్ని ఇలానే వదిలేస్తే తర్వాత ఇంకా భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. ఇలాంటివి ముందుముందు జరగకుండా ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ ఇన్‌సైడ్ లీక్స్ బారి నుంచి తప్పించుకోవచ్చు అనేది ఆలోచించి ఆ దిశగా అడుగులేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
