వాళ్లిద్దరికీ రిజల్ట్ ముందే తెలుసా?
'సికిందర్' విషయంలో అనుకున్నట్లే జరిగిందా? ముందే అనుకున్న ఫలితం సాధించిందా? అంటే అవుననే తెలుస్తోంది.
By: Tupaki Desk | 31 March 2025 7:03 AM'సికిందర్' విషయంలో అనుకున్నట్లే జరిగిందా? ముందే అనుకున్న ఫలితం సాధించిందా? అంటే అవుననే తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా మురగదాస్ తెరకెక్కించిన 'సికిందర్' రిలీజ్ కి ముందే హైప్ తీసుకు రావడంలో వీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ ఎంత గ్రాండ్ గా పట్టాలెక్కిందే! ప్రచార చిత్రాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అయిన తర్వాత ఆ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైంది.
గ్లింప్స్ నుంచి రిలీజ్ కు ముందు రిలీజ్ అయ్యే ట్రైలర్ వరకూ అదే సన్నివేశం కనిపించింది. ఏ దశలోనూ సినిమా అంచనాలు పెంచలేకపోయింది. ఉన్న హైప్ కూడా డౌన్ ఫాల్ అయింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సినిమా మార్చి 30న రిలీజ్ అయింది. తొలి షోతోనే సినిమా తేలిపోయింది. క్రిటిక్స్ పెదవి విరిచేసారు. రొటీన్ సినిమా తీసి జనాల్ని విసిగించాడు అనే విమర్శ మూటగట్టుకున్నాడు.
కథ నుంచి ఎంపిక చేసుకున్న పాత్రలు కూడా పూర్తిగా ఫెయిలయ్యాయని అంటున్నారు. ముఖ్యంగా విలన్ పాత్ర పోషించిన సత్యరాజ్ పాత్ర విషయంలో చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఆపాత్రకు సత్యరాజ్ ఏమాత్రం సెట్ అవ్వలేదని....బలమైన పాత్రలో బలహీన నటుడ్ని ఎంపిక చేయడం అతి పెద్ద తప్పిదంగా హైలైట్ అవుతుంది. బేసిక్ గా సత్యరాజ్ విలన్ పాత్రలకు ఏమాత్రం సెట్ కాడు.
కీలక పాత్రల్లో అవి పాజిటివ్ రోల్స్ అయితే పర్వాలేదు. అందులో నెగివిటీని చూపించాలంటే సత్యరాజ్ తేలిపోతాడు. సత్యరాజ్ పాత్ర విషయంలో మురగదాస్ అంచనాలు పూర్తిగా తప్పాయంటున్నారు. అలాగే సల్మాన్ కి జోడీగా రష్మిక మందన్నా ఎంపిక కూడా రాంగ్ ఛాయిస్ గా వినిపిస్తుంది. ఇద్దరి మధ్య ఏమాత్రం కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు. ఉన్న సన్నివేశాలు కూడా పాత సినిమాల్ని పోలి ఉన్నాయంటున్నారు.
ఇతర నటీనటుల ఎంపిక విషయంలోనూ ఇదే రకమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శర్మన్ జోషి, సత్యరాజ్ రష్మిక మందన్న ఎవరూ తమ సామర్ధ్యాన్ని పూర్తిస్థాయిలో బయట పెట్టలేదంటున్నారు. మురగదాస్ పాత్రలను కాగితంపై బలంగా రాసుకున్నా? వెండి తెరపై వాటిని ఆవిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాడని అంటున్నారు. మొత్తానికి సికిందర్ పై ఈ రేంజ్ లో విమర్శలు వెల్లు వెత్తుతాయని ఊహించలేదు.
అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు మురగదాస్ భారీ హైప్ తీసుకొచ్చేలా మాట్లాడలేదు. కామ్ గానే ప్రచారం చేసారు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా తన సినిమాల్ని సౌత్ ఆడియన్స్ చూడరని సింపతీ ట్రై చేసారు. మరి `సికిందర్` ఫలితం ముందే ఊహించి ఇద్దరు ఇలా ఉన్నారా? అన్నది ఇప్పుడు తెరపైకి వస్తుంది. అయితే ప్లాప్ అయ్యే సినిమాల విషయంలో ఫలితం ముందే తెలిసిపోయినా? ఓపెనింగ్స్ కోసం గేమ్ ఆడుతుంటారు కొందరు. కానీ అలాంటి గేమ్ లను సల్మాన్ ఖాన్- మురగదాస్ ఆడలేదన్నది వాస్తవం.