Begin typing your search above and press return to search.

'సైమా' లో టాలీవుడ్..శాండిల్ వుడ్ ఇలా మిక్స్!

ఇదిగో ఇక్క‌డిలా నిఖిల్.. హ‌నురాఘ‌వ‌పూడి.. చందు మొండేటి ..ర‌క్షిత్ శెట్టి..రిష‌బ్ శెట్టి ఓ గ్యాంగ్ లా ఏర్ప‌డి ఫోటోలకు ఫోజులిచ్చారు.

By:  Tupaki Desk   |   17 Sep 2023 6:56 AM GMT
సైమా లో టాలీవుడ్..శాండిల్ వుడ్ ఇలా మిక్స్!
X

ఇటీవ‌లే దుబాయ్ లో సైమా అవార్డు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. తొలి ద‌శ వేడుక‌ల్లో భాగంగా క‌న్న‌డ‌..టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి చాలా మంది సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. అయితే కొంత మంది టాలీవుడ్..శాండిల్ వుడ్ న‌టులు అవార్డు వేడుక‌ల్లో భాగంగా వ్య‌క్తిగ‌తంగానూ ఇంట‌రాక్ట్ అయిన‌ట్లు తెలుస్తోంది.

ఇదిగో ఇక్క‌డిలా నిఖిల్.. హ‌నురాఘ‌వ‌పూడి.. చందు మొండేటి ..ర‌క్షిత్ శెట్టి..రిష‌బ్ శెట్టి ఓ గ్యాంగ్ లా ఏర్ప‌డి ఫోటోలకు ఫోజులిచ్చారు. అవార్డు వేడుక‌లు ప్రారంభానికి ముందు అంతా ఒకే హోట‌ల్ లో బ‌స చేయ‌డంతో ఇలా ఒకే రూమ్ లో గేద‌ర్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌న్నివేశం చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. సాధార‌ణంగా ఇలా క‌ల‌వ‌డం అన్న‌ది చాలా రేర్. అవార్డు వేడుక‌ల్లోనే సాధ్య‌మ‌వుతుంది. అందులోనూ అంతా పాజిటివ్ గా ఉండ‌గ‌ల్గితేనే జ‌రిగేది.

అంతా క‌ళామాత‌ల్ని బిడ్డలం అనే సోద‌ర భావంతో దిగిన ఫోటో ఇది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఒకే ప్రేమ్ లో రెండు భాష‌ల న‌టుల్ని చూడ‌టంతో సంతోషంగా ఉందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇందులో నిఖిల్..రిష‌బ్ శెట్టి లుక్ మాత్రం చాలా కొత్త‌గా ఉంది. స్మార్ట్ గా క‌నిపించే ఇద్ద‌రు హీరోలు గుబురు గెడ్డం..హెయిర్ బాగా పెంచారు.

'స్వ‌యంభు' సినిమా కోసం నిఖిల్ కొత్త గెట‌ప్ కోసం ఇలా మారాల్సి వ‌చ్చింది. అలాగే రిష‌బ్ శెట్టి కాంతార‌-2 ప‌నుల్లో బిజీగా ఉన్నారు. లుక్ ప‌రంగానూ కొత్త‌గా ట్రై చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక హ‌ను రాఘ‌వ‌పూడి 'సీతారామం' త‌ర్వాత ఇంకా కొత్త ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించ‌లేదు.

ఆ ప‌నుల్లోనే బిజీగా ఉన్నారు. చందు మొండేటి నాగ‌చైత‌న్య హీరోగా సినిమా రూపొందించే ప‌నుల్లో ఉన్నారు. ఇక ర‌క్షిత్ శెట్టి క‌న్న‌డ‌లో ఇటీవ‌లే ఓ క్లాసిక్ హిట్ అందుకున్నాడు. ఆ చిత్రాన్ని తెలుగులోకి అనువ‌దిస్తున్నారు.