Begin typing your search above and press return to search.

సైమా అవార్డ్స్.. RRR, సీతారామం డామినేషన్

2023 అవార్డులకి గాను ప్రస్తుతం పోటీ జరుగుతోంది.దీనికోసం ఇప్పటికే ఆయా భాషల లో సినిమాలు వివిధ కేటగిరీల లో నామినేషన్స్ కి వెళ్లి పోటీ పడుతున్నాయి.

By:  Tupaki Desk   |   2 Aug 2023 3:57 AM GMT
సైమా అవార్డ్స్.. RRR, సీతారామం డామినేషన్
X

సౌత్ ఇండియా లో జరిగే అతి పెద్ద సినిమా అవార్డుల వేడుక సైమా. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ప్రతి ఏడాది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సౌత్ కి చెందిన నాలుగు భాషల సినిమాలు ఇందులో అవార్డుల కోసం పోటీ పడుతూ ఉంటాయి. సౌత్ మొత్తానికి అవార్డులు ఇవ్వడంతో పాటుగా ఆయా భాషల వారీగా కూడా ఉత్తమ అవార్డుల ని ఈ వేడుకలో అందిస్తారు.

అత్యంత ప్రజాధారణ ఉన్న అవార్డుల వేడుకల లో ఇది కూడా ఒకటి. సౌత్ ఇండియన్ యాక్టర్స్ అందరూ కూడా ఈ వేడుకల లో కచ్చితంగా పాల్గొంటారు. 2023 అవార్డులకి గాను ప్రస్తుతం పోటీ జరుగుతోంది.దీనికోసం ఇప్పటికే ఆయా భాషల లో సినిమాలు వివిధ కేటగిరీల లో నామినేషన్స్ కి వెళ్లి పోటీ పడుతున్నాయి. తెలుగు లో పాన్ ఇండియా సినిమాలైన ఆర్ఆర్ఆర్ 11 విభాగాల లో పోటీలో ఉండగా, సీతారామం మూవీ 10 కేటగిరీల లో పోటీ పడుతోంది.

వీటితో పాటు డీజే టిల్లు, కార్తికేయ 2 బెస్ట్ మూవీస్ కేటగిరీలో రేసు లో ఉన్నాయి. ఇక తమిళం నుంచి మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీ ఏకంగా 10 విభాగాల లో అవార్డుల కోసం రేసు లో ఉంది. లోకేష్ కనగరాజ్ విక్రమ్ తొమ్మిది కేటగిరీల లో అవార్డుల కోసం పోటీ పడుతోంది. ఉత్తమ తమిళ్ చిత్రం విభాగం లో పీసీ-1, విక్రమ్ తో పాటు లవ్ టుడే, తిరుచిత్రంబలం, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ పోటీపడుతున్నాయి.

కన్నడ ఇండస్ట్రీ నుంచి కాంతారా, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలు ఏకంగా 11 విభాగాల లో అవార్డుల కోసం నామినేషన్స్ తో టాప్ లో ఉన్నాయి. కాంతారా, కేజీఎఫ్ చాప్టర్ 2, 777 చార్లీ, లవ్ మాక్‌టెయిల్ 2, విక్రాంత్ రోనా బెస్ట్ కన్నడ మూవీ కేటగిరీ లో పోటీ పడుతున్నాయి. ఇక మలయాళీ చిత్ర పరిశ్రమ నుంచు మమ్ముట్టి భీష్మ పర్వం 8 కేటగిరీలలో నామినేషన్స్ వేసి రేసు లో టాప్ లో ఉంది.

తరువాత టోవినో థామస్ తల్లుమాల 7 విభాగాల లో అవార్డుల కోసం పోటీ పడుతున్నాయి.భీష్మ పర్వం, తల్లుమాల, హృదయం, జయ జయ జయ హే, జన గణ మన, తాన్ కేస్ కొడు ఉత్తమ మలయాళ చిత్రం అవార్డ్ కోసం రేసు లో ఉన్నాయి. ఈ అవార్డుల వేడుక దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 15, 16 తేదీలలో నిర్వహించబోతున్నారు. సౌత్ ఇండియన్ సినీ ప్రముఖులు అందరూ కూడా ఈ వేడుకకి హాజరు కానున్నారు.