Begin typing your search above and press return to search.

తార‌లంతా ఛ‌లో దుబాయ్

ఇంకా టాలీవుడ్ నుంచి చాలా మంది సెల‌బ్రిటీలు హాజ‌ర‌వుతున్నారు. అలాగే ఈ ఏడాది 'ఆర్ ఆర్ ఆర్' 11 కేట‌గిరిల్లో నామినేష‌న్లు ద‌క్కించుకుంది

By:  Tupaki Desk   |   14 Sep 2023 11:48 AM GMT
తార‌లంతా ఛ‌లో దుబాయ్
X

తారలంతా దుబాయ్ ప్లైట్ ఎక్కేస్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఈనెల 15..16 తేదీల్లో దుబాయ్ లో అంగ‌రంగ వైభ‌వంగా సైమా అవార్డు వేడుక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తీ ఏడాదిలానే ఈ సారి కూడా సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్స్డ్(సైమా) దుబాయ్ వేదికైంది. ఈ వేడుక‌ల్లో పాల్గొనేందుకు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కుటుంబ స‌మేతంగా నేడు బ‌య‌ల్దేరారు.

తార‌క్ ఫోటోలు ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అలాగే తార‌క్ తో పాటు హీరోలు య‌శ్.. రిషబ్ శెట్టి.. హీరోయిన్లు మృణాల్ ఠాకూర్.. శ్రీలీల కూడా సైమా వేడుక‌ల్లో పాల్గొన‌బోతున్నారు. ఇప్ప‌టికే కొంత మంది దుబాయ్ చేరుకోగా మ‌రికొంత మంది ప్లైట్ ఎక్కే ప‌నిలో ఉన్నారు. వాళ్ల షెడ్యూల్స్ ముగించుకుని రేప‌టి క‌ల్లా తార‌లంతా దుబాయ్ లో ఉంటారు.

ఇంకా టాలీవుడ్ నుంచి చాలా మంది సెల‌బ్రిటీలు హాజ‌ర‌వుతున్నారు. అలాగే ఈ ఏడాది 'ఆర్ ఆర్ ఆర్' 11 కేట‌గిరిల్లో నామినేష‌న్లు ద‌క్కించుకుంది. అలాగే 'సీతారామం' చిత్రానికి 10 కేట‌గిరిల్లో నామినేష‌న్లు ద‌క్కాయి. ఇక క‌న్న‌డ సినిమా 'కాంతార‌'..'కేజీఎఫ్‌-2'.. సినిమాల‌కు 11 కేట‌గిరిల్లో నామినేష‌న్లు ద‌క్కాయి. తెలుగు నుంచి ఉత్త‌మ న‌టుడు విభాగంలో రామ్ చ‌ర‌ణ్‌..ఎన్టీఆర్.. నిఖిల్ ..సిద్దు జొన్న‌ల గ‌డ్డ‌.. దుల్క‌ర్ స‌ల్మాన్..అడ‌వి శేషు పోటీ ప‌డుతున్నారు. వీళ్లంతా కూడా సైమా వేడుక‌ల్లో పాల్గొంటారు. ఇంకా తెలుగు నుంచి చాలా మంది న‌టీన‌టులు..ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు హాజ‌ర‌వుతారు.

సైమా వేడుక‌ల ప్ర‌త్యేక‌త‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఈవెంట్ ప్ర‌తీ ఏడాది భారీ ఎత్తున నిర్వ‌హిస్తు న్నారు. ఆకాశంలో న‌క్ష‌త్రాలు అన్ని ఒకే చోట ఉన్న‌ట్లు ఉంటుంది. ఆ స‌న్నివేశం చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌వ‌న్నంత‌గా ఉంటుంది. డిజైన‌ర్ దుస్తుల్లో అందాల‌న్ని మిరుమిట్లు గొలుపుతారు. రంగ‌లు వేదిక‌పై భామ‌ల బ్యూటీ వ‌ర్ణ‌నాతీతం.