Begin typing your search above and press return to search.

పుష్ప దెబ్బకి సింగం వెనకడుగు

పుష్ప2తో పోటీ పడితే కచ్చితంగా కలెక్షన్స్ పరంగా ఎఫెక్ట్ ఉంటుందని ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.

By:  Tupaki Desk   |   13 Sep 2023 3:51 AM GMT
పుష్ప దెబ్బకి సింగం వెనకడుగు
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా పుష్ప సినిమాలో పుష్ప రాజ్ పాత్రకిగాను అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చింది. దీంతో పుష్పరాజ్ పాత్రపై వెయిటేజ్ పెరిగిందని చెప్పాలి.

దీంతో సుకుమార్ మరింత బాద్యత తీసుకొని పుష్ప రాజ్ పాత్రని ప్రేక్షకులకి బలంగా రీచ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. షూటింగ్ ఆలస్యం అవుతున్న పెర్ఫెక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా తనకొచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ని మరింత స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక పుష్ప 2 కోసం దేవిశ్రీ ప్రసాద్ కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.

వచ్చే ఏడాది ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. అయితే అదే సమయంలో హిందీలో రోహిత్ శెట్టి సింగం సిరీస్ లో మూడో భాగం రానుంది. ఎప్పుడో ఆగష్టు 15 వీకెండ్ లో రావాలని రోహిత్ శెట్టి ప్లాన్ చేసుకున్నారు. సింగం అగైన్ టైటిల్ తో రాబోయే ఈ మూవీకి హిందీలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే పుష్ప 2తో పోల్చుకుంటే మాత్రం సెకండ్ ఛాయస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

అంతగా నార్త్ ఇండియన్స్ పుష్పకి అడిక్ట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో పుష్ప 2తో పోటీ పడటం ఎందుకని ఆలోచించి మరో డేట్ ఫిక్స్ చేసుకునే పనిలో రోహిత్ శెట్టి టీం ఉంది. పుష్ప2తో పోటీ పడితే కచ్చితంగా కలెక్షన్స్ పరంగా ఎఫెక్ట్ ఉంటుందని ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ఒక వేళ సింగం అగైన్ మూవీ వాయిదా పడిన పుష్ప 2కి పోటీగా శంకర్ ఇండియన్ 2 ఉండే ఛాన్స్ ఉంది.

ఈ మూవీ అదే టైంలో రిలీజ్ అయితే కొంత టఫ్ ఫైట్ ఉంటుంది. కోలీవుడ్ లో మాత్రం మొదటి ప్రాధాన్యత ఇండియన్ 2కి ఉంటుంది. ఇక మిగిలిన భాషలలో పుష్ప 2 ఫస్ట్ ఛాయస్ గా ఉంటుంది. మరి పుష్ప రాజ్ స్పీడ్ ని తట్టుకొని ఎవరైనా పోటీకి నిలబదతారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.