Begin typing your search above and press return to search.

కియ‌రాకు సిద్ ప్ర‌పోజ్ చేసిన చోటు?

కియారా నవ్వుతూ, ''సిద్ ఆ ఎపిసోడ్ కోసం వచ్చినప్పుడు మేము రోమ్ నుండి తిరిగి వచ్చాము. అక్కడ అతడు నాకు ప్రపోజ్ చేసాడు'' అని చెప్పింది.

By:  Tupaki Desk   |   5 Dec 2023 3:53 AM GMT
కియ‌రాకు సిద్ ప్ర‌పోజ్ చేసిన చోటు?
X

ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తిభావంతుడిగా పేరు తెచ్చుకున్న సద‌రు హీరో.. అప్పుడే రైజింగ్ స్టార్ గా ఎదిగేస్తున్న ప్ర‌ముఖ హీరోయిన్ కి ప్ర‌పోజ్ చేసాడు. ఆ ఇద్ద‌రూ క‌లిసి ఒక స్టీమీ వెబ్ సిరీస్ లో న‌టించాక అస‌లు క‌థ మొదైలంది. స్నేహం ప్రేమ‌గా మారింది. ఆ త‌ర్వాత డేటింగ్ వ‌ర‌కూ వెళ్లింది. అటుపై అది పెళ్లి పీట‌ల వ‌ర‌కూ వెళ్ల‌డంతో శుభం కార్డ్ ప‌డింది. ఇంత‌కీ ఇది ఏ జంట గురించో తెలుసా? సిద్ధార్థ్ మ‌ల్హోత్రా- కియ‌రా అద్వాణీ గురించే ఇదంతా.

సిధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారు డేటింగ్ చేసారనే పుకార్లు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ఇద్దరూ వివాహం చేసుకునే వరకు వారి సంబంధాన్ని అంగీకరించలేదు. ఈ జంట‌ ప్రేమ కథకు చివ‌రికి పెళ్లితో క్లారిటీ వ‌చ్చింది. ఈ జోడీ డేటింగ్ వ్య‌వ‌హారంలో తెలివిగా వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు కియారా తనకు సిద్ధార్థ్ చేసిన ప్రతిపాదన వివరాలను వెల్లడించింది.

'గోవిందా నామ్ మేరా' సహనటుడు విక్కీ కౌశల్‌తో కలిసి 'కాఫీ విత్ కరణ్ 8'లో కియ‌రా అద్వాణీ కనిపించనుంది. మీరు చివరిసారిగా కియారా బెటర్ హాఫ్‌తో ఈ సోఫాలో ఉన్నారని కరణ్ విక్కీకి చెప్పాడు. కియారా నవ్వుతూ, ''సిద్ ఆ ఎపిసోడ్ కోసం వచ్చినప్పుడు మేము రోమ్ నుండి తిరిగి వచ్చాము. అక్కడ అతడు నాకు ప్రపోజ్ చేసాడు'' అని చెప్పింది.

ఎట్ట‌కేల‌కు రోమ్‌లో సిద్ధార్థ్ తో సీక్రెట్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. అయితే కియారా పెళ్లి కలీరాస్‌లో కూడా ఆ వివరాలు ఉన్నాయి. కియ‌రా కలీరాస్‌లో KS - వారి మొదటి అక్షరాలు కియ‌రా సిద్ధార్థ్. కలీరాస్‌పై ఉన్న డాంగ్లర్‌లలో ఒకదానిలో రోమ్ కూడా ఉంది. కియ‌రా ఇచ్చిన క్లారిటీతో.. రోమ్ పేరును ఎందుకు ప్రస్తావించారో ఇప్పుడు అందరికీ తెలిసిన‌ట్టే.

సిద్ధార్థ్ ఇటీవల వరుణ్ ధావన్‌తో కలిసి క‌ర‌ణ్‌ షోలో క‌నిపించాడు. కియారా - సిద్ధార్థ్ గొడవ పడుతున్నప్పుడు.. ఆ ఇద్ద‌రూ బంధంలో సీరియస్‌గా ఉన్నారని తనకు తెలుసున‌ని కరణ్ చెప్పాడు. కియారా ఒక మూలన కూర్చొని సిద్ధార్థ్‌కు ఆహారం తినిపించడం గురించి కూడా రివీల్ చేసాడు. ఈ ఎపిసోడ్‌లో కియారా కూడా ఒకరినొకరు(సిద్ తో) ప్రేమతో 'మంకీ' అని పిలుచుకుంటామ‌ని వెల్లడించింది.