Begin typing your search above and press return to search.

హ‌బ్బీ హ‌గ్ లో కియారా..అత‌నే నాల‌వ్..నాలైట్!

దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలుపుతూ మైలవ్ అండ్ లైట్ అని పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఆజోడీ అభిమానులు విషెస్ తెలియ‌జేస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Nov 2023 3:09 PM GMT
హ‌బ్బీ హ‌గ్ లో కియారా..అత‌నే నాల‌వ్..నాలైట్!
X

సిద్దార్ద్ మ‌ల్హోత్రా-కియారా అద్వాణీ జోడీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పండ‌గొచ్చిందంటే? ఆ వాతావ‌ర‌ణ మంతా వాళ్లిద్ద‌రిలో సంథిగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తుంది. సంప్ర‌దాయ దుస్తుల్లో పండ‌గంతా మాదే అనిపిస్తారు. తాజాగా దివాలీని పుర‌స్క‌రించుకుని జోడీ మ‌రోసారి అలాంటి సంచ‌ల‌నానిక తెర తీసారు. ఇదిగో ఇలా భార్యాభ‌ర్త‌లిద్ద‌రు ఆక‌ర్షణీయ‌మైన దుస్తుల్లో ఒదిగిపోయారు. సిద్దార్ధ్ కొత్త పెళ్లికొడుల‌కు ముస్తాబ‌య్యాడు.


పువ్వ‌ల డిజైన్ తో కూడిన వ‌స్త్రాల్లో మెరిసిపోతున్నాడు. అదే స‌మ‌యంలో భార్య కియారా సైతం అంతే అందంగా ముస్తాబై భ‌ర్త కౌగిలిలో మునిగిపోయింది. గోల్డ్ క‌ల‌ర్ డిజైన్ లో కియారా మిరుమిట్లు గొలుపు తుంది. ఇద్ద‌రు ఒక‌ర్ని ఒక‌రు ఘాడంగా హ‌త్తుకుని దివాలీ సంద‌ర్భంగా దిగిన ఫోటోని అభిమానుల‌కు షేర్ చేసారు. ఈ ఫోటోపై కియారా ఇంట్రెస్టింగ్ క్యాప్ష‌న్ ఇచ్చింది.


దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలుపుతూ మైలవ్ అండ్ లైట్ అని పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఆజోడీ అభిమానులు విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఇక వృత్తిప‌రంగా ఇద్ద‌రు బిజీగానే ఉన్నారు. 'షేర్ షా' విజ‌యంతో బాలీవుడ్ లో హిట్ పెయిర్ గా మారారు. ఆ జోడీతో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని మేక‌ర్స్ వెయిట్ చేస్తున్నారు.


ఇక సిద్దార్ధ్ వ్య‌క్తిగ‌తంగా బాలీవుడ్ చిత్రాల‌తో బిజీగా ఉంటే..కియారా మాత్రం హిందీతో పాటు తెలుగు సినిమాలు చేస్తోంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'గేమ్ ఛేంజ‌ర్' లో ఛాన్స్ అందుకుంది. ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేసింది. చ‌ర‌ణ్ తో తెర‌ను పంచుకోవ‌డం రెండ‌వ సారి. ఇంత‌కు ముందు విన‌య విధేయ రామ‌లో న‌టించింది. ఆ సినిమా ప్లాప్ అయినా సూప‌ర్ జోడీగా పేరొచ్చింది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి శంక‌ర్ ఆ భామ‌నే ఎంపిక చేసారు.