Begin typing your search above and press return to search.

టిల్లు స్క్వేర్.. ఆ 10 నిమిషాలు విజిల్ పడేలా..

By:  Tupaki Desk   |   24 Feb 2024 3:02 PM GMT
టిల్లు స్క్వేర్.. ఆ 10 నిమిషాలు విజిల్ పడేలా..
X

సిద్దు జొన్నలగడ్డ కెరీర్ కు ఒక్కసారిగా ఊపు తీసుకొచ్చిన సినిమా DJ టిల్లు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తో ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. విడుదలకు ముందే ఈ సినిమా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంటుంది. సితార ఎంటర్టైన్మెంట్ లో రూపొందుతున్న ఈ సినిమాను నాగ వంశీ నిర్మించారు.

అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే మంచి ప్రాఫిట్ అందించినట్లుగా తెలుస్తోంది. ఇక విడుదల తర్వాత మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే టిల్లు స్క్వేర్ సినిమాలో కంటెంట్ కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేలా ఉంటుంది అని ఇప్పటికే చిత్ర యూనిట్ గట్టిగా ప్రమోషన్ చేస్తోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఒక ట్రైలర్ ద్వారానే చూపించేశారు.

దీంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే మొదట వచ్చిన DJ టిల్లు హీరోయిన్ క్యారెక్టర్ లో మాత్రం పెద్దగా రొమాన్స్ లేదు. అందులో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి మంచి గ్లామరస్ బ్యూటీ అయినప్పటికీ కూడా తన రాధిక పాత్రకు యాక్టింగ్ తోనే మంచి క్రేజ్ తీసుకు వచ్చింది ఆ పాత్ర సినిమాలో క్లిక్ అయిన విధానం ఆమె కెరీర్ కు కూడా చాలా ఉపయోగపడింది.

అయితే సీక్వెల్ లో ఆమెను తీసుకోకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక విధంగా రాధిక అక్క క్యారెక్టర్ లేకపోవడం నిరాశను కలిగించే అంశం అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. అయితే ఆ బాధ తీర్చే విధంగా సీక్వెల్ సినిమాలో కూడా రాధిక ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు పది నిమిషాల పాటు ఆమె క్యారెక్టర్ హైలెట్ కాబోతోందట.

కరెక్ట్ గా స్టోరీ బలుపు తిరిగే సమయంలోనే రాధిక క్యారెక్టర్ ఇచ్చే ట్విస్ట్ కూడా మామూలుగా ఉండదని తెలుస్తోంది. కథకు అనుగుణంగానే పాత్రను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. తప్పకుండా విజిల్స్ పడతాయని కూడా చిత్ర యూనిట్ నమ్ముతోంది. మరి వారి నమ్మకం ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటాయో చూడాలి.

ఇక ఈ సినిమాలో అనుపమ గతంలో ఎప్పుడు లేనంత రొమాంటిక్ పాత్రలో కనిపించబోతున్న విషయం ట్రైలర్ ద్వారానే అర్థమయింది. ఆమె లిప్ లాక్ సన్నివేశాలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి ఇక మార్చి 8వ తేదీన రాబోతున్న టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్ అందుకునే అవకాశం అయితే కనిపిస్తోంది.