బ్యాడాస్ ఫస్ట్ లుక్.. సిద్ధు బాయ్ ఈసారి మరింత క్రేజీగా..
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ్యాడాస్ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 9 July 2025 12:55 PM ISTటాలీవుడ్‌లో కంటెంట్‌ను బలంగా నమ్మే నిర్మాణ సంస్థల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒకటి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ బ్యానర్ ఇప్పుడు మరో యంగ్ అండ్ ఎనర్జిటిక్ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ్యాడాస్ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.
"If middle finger was a man" అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన పోస్టర్‌లో సిద్ధు సిగరెట్ వెలిగించుకుంటూ కనిపించారు. చుట్టూ మీడియా కెమెరాలు, అటిట్యూడ్‌తో ఆయన లుక్ అంతా అటెన్షన్‌ను దక్కించుకుంది. టైటిల్ డిజైన్, క్యాప్షన్ ప్రెజెంటేషన్ చూస్తుంటే ఇది సాధారణ కథ కాదనే స్పష్టమవుతోంది. టైటిల్ బోల్డ్ గా ఉండటమే కాకుండా, సినిమా సబ్జెక్ట్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుందని సినీ జనాలు అంటున్నారు.
ఈ సినిమాకు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో సిద్ధు జొన్నలగడ్డ బ్లాక్‌బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోడీ మళ్లీ కలవడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఆ సినిమాలో పర్సనాలిటీ మీద పంచ్‌లు పడితే.. ఈసారి హై వోల్టేజ్ రేంజ్ లో ఉంటుందనే భావన క్రియేట్ అవుతోంది.
ఈ సినిమాకి కథను సిద్ధు, రవికాంత్ ఇద్దరూ కలిసి రాసినట్టు సమాచారం. కథ, కథనాల్లోనే కాదు.. ప్రెజెంటేషన్‌లోనూ వినూత్నంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారని టీమ్ చెబుతోంది. బడా నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుంది.
సిద్ధు జొన్నలగడ్డ గతంలో డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత వచ్చిన జాక్ మాత్రం ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు 'బ్యాడాస్'తో తన మార్క్‌ని మళ్లీ ప్రూవ్ చేసుకోవాలని సిద్ధు చూస్తున్నారు. టిల్లు ఫ్రాంచైజీ తరువాత వస్తున్న మూడో సినిమా కావడం, మాస్ స్టైలిష్ లుక్‌తో రాబోవడం విశేషం. మొత్తంగా, 'బ్యాడాస్' మొదటి లుక్ తోనే బజ్‌ను పెంచేలా చేసింది. పోస్టర్‌లో చూపించిన కాన్సెప్ట్, టైటిల్, డిజైన్ అన్ని గట్స్ ఉన్నవిగా కనిపిస్తున్నాయి. ఇకపై ఒక్కో అప్డేట్‌తో సినిమా ప్రమోషన్ రేంజ్ పెరిగే అవకాశం ఉందనే చెప్పాలి.
