Begin typing your search above and press return to search.

బ‌ట‌న్ లెస్ ఫోజ్‌తో చెల‌రేగిన శ‌ర్మా గాళ్

తాజాగా ఇన్ స్టాలో సిద్ధిక షేర్ చేసిన ఒక హాట్ ఫోజ్ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది. సిద్ధిక బ‌ట‌న్ లెస్ ఫోజ్ లో రెచ్చిపోయింది.

By:  Tupaki Desk   |   7 May 2024 3:15 AM GMT
బ‌ట‌న్ లెస్ ఫోజ్‌తో చెల‌రేగిన శ‌ర్మా గాళ్
X

2012 నుంచి న‌టిగా ల‌క్ చెక్ చేసుకుంటూనే ఉంది సిద్ధిక శ‌ర్మ‌. ఆల్ ది బెస్ట్, గ‌ల్లీ కుర్రాళ్లు లాంటి తెలుగు చిత్రాల్లో న‌టించింది ఈ బ్యూటీ. కానీ నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న‌ కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన‌ 'పైసా'లో న‌టించాకే గుర్తింపు ద‌క్కింది. సినిమాల‌తో స‌క్సెస్ కాలేక‌పోయినా కానీ ఈ బ్యూటీ వెబ్ సిరీస్ ల జోలికి పోలేదు. అప్పుడ‌ప్పుడు కొన్ని సింగిల్ ఆల్బ‌మ్స్ లో మాత్రం న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో ఫ్యాన్స్ కి కావాల్సిన ట్రీట్ ఇస్తూనే ఉంది. సిద్ధిక నిరంత‌ర ఫోటోషూట్లు అంతర్జాలంలో వేడెక్కిస్తున్నాయి.

తాజాగా ఇన్ స్టాలో సిద్ధిక షేర్ చేసిన ఒక హాట్ ఫోజ్ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది. సిద్ధిక బ‌ట‌న్ లెస్ ఫోజ్ లో రెచ్చిపోయింది. కెల్విన్ క్లెయిన్ ఇన్న‌ర్ ధ‌రించిన సిద్ధిక‌, డెనిమ్ జీన్స్ ధ‌రించింది. బ‌ట‌న్ లెస్ బాట‌మ్ లో ఇన్న‌ర్ సొగ‌సును ఆవిష్క‌రించింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇక ఒక‌దానితో ఒక‌టిగా పోటీప‌డుతూ సిద్ధిక షేర్ చేసిన రీసెంట్ ఫోటోషూట్లు యూత్ కి కిక్కిస్తున్నాయి. బ్లాక్ క‌ల‌ర్ జిప్డ్ ఫ్రాక్‌లో సిద్ధిక ఫోజులు ఇప్ప‌టికే ఇంట‌ర్నెట్ ని మ‌రిగిస్తున్న సంగతి తెలిసిందే.

సిద్ధిక కెరీర్ జ‌ర్నీ విష‌యానికి వ‌స్తే..మ్యూజిక్ వీడియోలతో పాపుల‌రైన ఈ బ్యూటీ కాలేజ్ రోజుల్లోనే స్టార్ అవ్వాల‌ని క‌ల‌లు గంది. తొలి ప్ర‌య‌త్నంలో విజయవంతమైన మోడల్‌గా వర్ధిల్లింది. ప్రఖ్యాత బ్రాండ్‌లకు ప్ర‌చారం చేసింది. సిద్ధిక కమర్షియల్- ప్రింట్ యాడ్స్‌లో తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించింది. ప్ర‌స్తుతం న‌టిగా పెద్ద స్థాయికి ఎద‌గాల‌ని క‌ల‌లు కంటోంది.