Begin typing your search above and press return to search.

వీడియో : సహనం కోల్పోయిన స్టార్‌ హీరో

సెలబ్రిటీలను ముఖ్యంగా స్టార్‌ హీరోలను, హీరోయిన్స్‌ను బయటకు వెళ్లిన సమయంలో మీడియా వారు ఈ మధ్య చాలా ఇబ్బంది పెడుతున్నారు అనే విమర్శ ఉంది.

By:  Tupaki Desk   |   24 April 2025 11:43 AM IST
Siddharth Malhotra Fires On Paps
X

సెలబ్రిటీలను ముఖ్యంగా స్టార్‌ హీరోలను, హీరోయిన్స్‌ను బయటకు వెళ్లిన సమయంలో మీడియా వారు ఈ మధ్య చాలా ఇబ్బంది పెడుతున్నారు అనే విమర్శ ఉంది. మీడియా వారు ఫోటోలు తీసేందుకు ప్రయత్నించడంతో పాటు, సమయం సందర్భం లేకుండా ఇష్టానుసారంగా ప్రశ్నలతో వేదిస్తున్నారు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. మీడియా వారు అంటే గౌరవం అంటూనే తమ ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేసే హీరోలు, హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తాజాగా బాలీవుడ్ యంగ్‌ హీరో సిద్దార్థ్‌ మల్హోత్రా ఫోటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేశాడు. మీడియా వారి అత్యుత్సాహంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇటీవల సిద్దార్థ్‌ మల్హోత్రా కారు ఎక్కేందుకు బయటకు వచ్చిన సమయంలో ఫోటోగ్రాఫర్లు తోసుకు వచ్చారు. కారు ఎక్కేందుకు కూడా ఇబ్బంది అయింది. దాంతో ఫోటోగ్రాఫర్స్‌పై సిద్దార్థ్ మల్హోత్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెనక్కి వెళ్లండి, మీ హద్దులు దాటొద్దు అంటూ అక్కడున్న వారి పైకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దాంతో ఫోటోగ్రాఫర్లు వెంటనే అక్కడ నుంచి వెళ్లి పోయారు. ఈ విషయమై కొందరు మీడియా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిద్దార్థ్‌ మల్హోత్ర తీరును ఖండిస్తున్నామంటూ సోషల్‌ మీడియా ద్వారా కామెంట్‌ చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన మంచిది కాదని కొందరు సిద్దార్థ్ మల్హోత్ర తీరును తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు.

ఎంత సెలబ్రిటీ అయినా ప్రైవసీ అనేది కూడా ఉండాలి అనేది కొందరి అభిప్రాయం. ఆయన అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఫోటోలు తీయడం అనేది కచ్చితంగా ఆయన వ్యక్తిగత భద్రతకు భంగం కల్పించడం అవుతుంది. అంతే కాకుండా ఆయన్ను ఇబ్బంది పెట్టడమే కదా అని కొందరు సిద్దార్థ్‌ మల్హోత్రకి మద్దతుగా నిలుస్తున్నారు. సిద్దార్థ్ కోపాన్ని అర్థం చేసుకున్న మీడియా వారు వెంటనే అక్కడ నుంచి వెళ్లి పోయారు. తనను ఇబ్బంది పెట్టవద్దు, దయచేసి వెళ్లి పోండి అంటూ చెప్పినా కూడా వారు వెళ్లి పోయేవారు కదా అంటూ కొందరు ఈ విషయమై స్పందిస్తున్నారు. మొత్తానికి హీరో మీడియా వారిపై అసహనం వ్యక్తం చేశాడంటూ సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు.

సిద్దార్థ్‌ మల్హోత్ర సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పరమ్‌ సుందరి సినిమాలో నటిస్తున్నాడు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా రూపొందుతున్న ఆ సినిమా కేరళలో షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే జాన్వీ కపూర్‌కి సిద్దార్థ్‌ స్కూటీ నడిపిస్తున్న ఫోటోలు వైరల్‌ అయ్యాయి. గత చిత్రం యోధ ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోయింది. దాంతో పరమ్‌ సుందరి పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవలే తండ్రి కాబోతున్నట్లు సిద్దార్థ్‌ మల్హోత్ర అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. సిద్దార్థ్‌ భార్య కియారా అద్వానీ ప్రస్తుతం గర్బవతి. ఈ ఏడాది చివరి వరకు వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు.