కియారా, సిద్ధార్థ్ కు పేరెంట్స్ గా ప్రమోషన్.. వారి ఆస్తి ఎంతంటే?
బాలీవుడ్ లవ్లీ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ ప్రమోషన్ పొందారు. ఈ బ్యూటిఫుల్ కపుల్ తాజాగా తల్లిదండ్రులయ్యారు
By: Tupaki Desk | 16 July 2025 1:46 PM ISTబాలీవుడ్ లవ్లీ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ ప్రమోషన్ పొందారు. ఈ బ్యూటిఫుల్ కపుల్ తాజాగా తల్లిదండ్రులయ్యారు. ముంబై గిర్గావ్‌లోని హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ కు చెందిన ఆసుపత్రిలో తాజాగా కియారా ప్రసవించారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.
దీంతో కియారా- సిద్ధార్థ్ పేరెంట్స్ గా జీవితంలో కొత్త చాప్టర్ లోకి ఆడుగుపెట్టారు. ఇక ఈ జంటకు సెలబ్రిటీలు, అభిమానులు, సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ ఇద్దరూ 2023 ఫిబ్రవరి 7న వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. వీరి వివాహం రాజస్థాన్ జైసల్మేర్‌లోని విలాసవంతమైన సూర్య గఢ్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది.
అయితే తాజాగా వీరికి పాప పుట్టడంతో సోషల్ మీడియాలో కియారా- సిద్ధార్థ్ కపుల్ ట్రెండింగ్ లో నిలిచింది. అభిమానుల్లో కొందరు చిన్నారికి ఏం పేరు పెట్టారని వెతుకుతుండగా, మరికొందరూ ఈ జంట నెట్ వర్త్ ఎంత ఉండొచ్చని సెర్చ్ చేస్తున్నారు. మరి కియారా అద్వానీ, సిద్ధార్థ్ నెట్‌వర్త్ ఎంతో తెలుసుకుందాం!
సాధారణంగా సెలబ్రిటీలు అంటేనే విలాసవంతమైన జీవితం గడుపుతుంటారు. లైఫ్ స్టైల్, ఇల్లు, కారు ఇలా ప్రతిదీ కాస్ట్లీగానే ఉంటుంది. అయితే కియార- సిద్ధార్థ్ తమతమ కెరీర్ లో బాగానే సెటిల్ అయ్యారు. ఇద్దరూ బాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. కియార అయితే తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది. సినిమాలతోపాటు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్, డీల్స్, ప్రమోషన్స్, కొలాబ్రేషన్స్ ఇలా పలు మార్గాల్లో సంపాదిస్తున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో కియారా ఒకరు. ఆమె ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఎండార్స్‌మెంట్ లో ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కు రూ. 1.5 కోట్లు వసూల్ చేస్తున్నారు. సెంకో గోల్డ్, గెలాక్సీ చాక్లెట్లు, మైంట్రా వంటి ప్రముఖ బ్రాండ్లను కియారా ప్రమోట్ చేస్తున్నారు. అలాగే BMW X5, ఆడి A8L, BMW 530d, మెర్సిడెస్- బెంజ్ E-క్లాస్ వంటి ప్రీమియర్ కార్లు ఆమె గ్యారెజ్ లో ఉన్నాయి. ఓవరాల్గా కియారా నెట్ వర్త్ రూ.40 కోట్లు ఉంది.
మరోవైపు, సిద్ధార్థ్ మల్హోత్రా నెట్ వర్త్ వ్యాల్యూ రూ. 105 కోట్లు ఉంది. షేర్షా, మార్జావాన్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో తనకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్నారు. సిద్ధార్థ్ ఒక్కో సినిమాకు రూ. 15- 20 కోట్లు వసూలు చేస్తున్నారు. అయ ప్రస్సుతం పెపీ జీన్స్, మెట్రో షూస్, కోకా- కోలా వంటి బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు. ఇక కార్ కలెక్షన్లో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, మెర్సిడెస్ మే బ్యాక్ S500, హార్లే- డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ ఉన్నాయి. ఇలా ఈ క్యూట్ కపుల్ టోటల్ నెట్ వర్త్ వ్యాల్యూ రూ.145 కోట్లుగా ఉంది.
