పిక్‌టాక్ : జాన్వీకి స్కూటీ నేర్పుతున్న రొమాంటిక్ హీరో
బాలీవుడ్ యంగ్ రొమాంటిక్ హీరో సిద్దార్థ్ మల్హోత్ర ప్రస్తుతం తుషార్ జలోటా దర్శకత్వంలో 'పరమ్ సుందరి' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 22 April 2025 12:27 PM ISTబాలీవుడ్ యంగ్ రొమాంటిక్ హీరో సిద్దార్థ్ మల్హోత్ర ప్రస్తుతం తుషార్ జలోటా దర్శకత్వంలో 'పరమ్ సుందరి' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు కేరళలో ఉన్నారు. నార్త్ ఇండియా అబ్బాయి, సౌత్ ఇండియన్ అమ్మాయి మధ్య ప్రేమ చిగురిస్తే, ఆ తర్వాత ఉండే పరిణామాలు, రెండు విభిన్నమైన కల్చర్‌లను ఫాలో అయ్యే అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమ ఉంటే ఎలాంటి వినోదాత్మక సంఘటనలు, సన్నివేశాలు ఉంటాయి అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్‌లో ఈ సినిమాతో జాన్వీ మొదటి హిట్ కొట్టడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పరమ్ సుందరి సినిమా షూటింగ్ కోసం కేరళలో ఉన్న సిద్ధార్థ్ మల్హోత్ర, జాన్వీ కపూర్‌లు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. కేరళ అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉన్న చిత్ర యూనిట్ సభ్యులు మరి కొన్ని రోజుల్లో షెడ్యూల్ పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా జాన్వీ కపూర్ ఈ ఫోటోలను షేర్ చేసింది. జాన్వీ కి సిద్దార్థ్ మల్హోత్రా స్కూటీని నేర్పిస్తూ ఉన్నాడు. ఇది సినిమాలో భాగంగా చేశారా అని చాలా మంది అనుకుంటున్నారు. జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో... నేను రైడ్‌కి తీసుకు వెళ్లడం పరమ్‌కి చాలా ఇష్టం అంటూ లవ్ ఈమోజీని షేర్ చేసింది. పరమ్ సుందరి హ్యాష్ ట్యాగ్‌ను షేర్ చేయడం ద్వారా ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
షూటింగ్ కోసమా లేదా జాన్వీ కపూర్‌కి ఆఫ్ ది రికార్డ్ సిద్దార్థ్ మల్హోత్రా స్కూటీ నేర్పిస్తున్నాడా అనేది తెలియదు. కానీ వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెడ్ చీర కట్టులో జాన్వీ కపూర్ చాలా ముద్దుగా ఉంది. జెడలో మల్లెపూలు ధరించడం చాలా స్పెషల్‌గా చెప్పుకోవచ్చు. ఇక స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి, బ్లాక్ కళ్లద్దాలు ధరించి ఉన్న జాన్వీ కపూర్ చాలా క్యూట్‌గా ఉండటంతో నేచురల్ బ్యూటీ అన్నట్లుగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్ ఇప్పటి వరకు తెలుగులో దేవర సినిమాలో నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలోనూ నటిస్తున్న విషయం తెల్సిందే.
బాలీవుడ్‌లో ఈమె ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది. అయినా కూడా అదృష్టం కలిసి రావడం లేదు. తెలుగులో మొదటి సినిమా దేవరతోనే సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు దక్కించుకుంది. రామ్ చరణ్ పెద్ది సినిమాతో పాటు అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రూపొందబోతున్న సినిమాలోనూ జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఆ సినిమా విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లోనూ మోస్ట్ వాంటెడ్ హీరోల జాబితాలో చోటు సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఏకంగా 26 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను దక్కించుకుంది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు అత్యధిక ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది.
