Begin typing your search above and press return to search.

సైడ్ రోల్.. రిజెక్ట్.. విలన్ - కట్ చేస్తే పాన్ ఇండియా హీరో

సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవాలి అని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 8:00 AM GMT
సైడ్ రోల్.. రిజెక్ట్.. విలన్ - కట్ చేస్తే పాన్ ఇండియా హీరో
X

సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవాలి అని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రూట్లో అందరికీ అనుకున్నట్లుగా అవకాశాలు దొరకడం అంత సాధ్యం కాదు. ఇక దర్శకుడు అయినవాళ్లు హీరోలు అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే హీరోలు అవ్వాలనుకున్నవాళ్లు ఆ తర్వాత డైరెక్టర్ గా రైటర్ గా కూడా మారాల్సిన పరిస్థితి వస్తుంది. ఎటు తిరిగి పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగడం సినిమా ఇండస్ట్రీలో విజయానికి తొలిమెట్టు అని చాలామంది చెబుతూ ఉంటారు.


ఇక అది పర్ఫెక్ట్ గా ఫాలో అయిన నటులలో మాత్రం అడివి శేష్ మొదటి స్థానంలో ఉంటాడు అని చెప్పవచ్చు. మొదట నటుడుగానే గుర్తింపును అందుకోవాలని హీరోగా అవకాశాల కోసం బాగానే ప్రయత్నం చేసిన అడివి శేష్ చాలా ఆడిషన్స్ లో అయితే రిజెక్ట్ అయ్యాడు. కొంతమంది అవకాశాలు ఇస్తామని చెప్పి మాట కూడా తప్పారు. ఇక 2002లో మొదటగా అడవి శేష్ సొంతం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించాడు.

ఆ తరువాత ఎనిమిదేళ్లు గ్యాప్ తీసుకున్న అతను మళ్లీ సరికొత్తగా తన కెరీర్ మొదలు పెట్టాడు. సొంత డబ్బులతో దర్శకుడిగా కథానాయకుడిగా మారి కర్మ అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా మాత్రం అతనికి కోలుకోలేని దెబ్బ కొట్టింది దారుణంగా డిజాస్టర్ అయింది. ఇక ఆ పరిస్థితులను దాటి విలన్ గా చేసి మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కట్ చేస్తే అతను 100 కోట్ల పాన్ ఇండియా సినిమా చేసే స్థాయికి ఎదిగాడు.

ముఖ్యంగా 2011లో పవన్ కళ్యాణ్ పంజా సినిమా అతనికి ఒక యూటర్న్ గా నిలిచింది. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ అందులో అతను చేసిన నెగటివ్ రోల్ కు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత బలుపు రన్ రాజా రన్ వంటి సినిమాలు చేస్తూ వచ్చిన అడవి శేష్ బాహుబలి సినిమాతో మరో రేంజ్ కు వెళ్ళిపోయాడు. అనంతరం సొంతంగా కథలు రాసుకోవడం స్టార్ట్ చేసే చిన్న బడ్జెట్ లో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు.

క్షణం - గూడచారి - ఎవరు.. వంటి సినిమాలు అడవి శేష్ ను హీరోగా ఒక స్థాయిలో నిలబెట్టాయి. ఇక తర్వాత మేజర్ సినిమా కూడా మరింత బూస్ట్ ఇచ్చింది. గత ఏడాది వచ్చిన హిట్ 2 సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు గూడచారి 2 తీస్తున్న విషయం తెలిసిందే. అలాగే పాన్ ఇండియా రేంజ్ లో ప్రస్తుతం 100 కోట్ల ప్రాజెక్టు సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమాలో శృతిహాసన్ కథానాయక సెలెక్ట్ అయ్యింది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి విలన్ గా చేసుకుంటూ ఆ తర్వాత తన సొంత కథలతోనే హీరోగా నిలదొక్కుకున్నాడు అడవి శేష్. అవకాశాలు కోసం ఎదురుచూడకుండా తన దారులను తనే వెతుక్కుంటూ వెళ్లి ఎవరి సహాయం లేకుండా ఇక్కడి వరకు వచ్చాడు అని చెప్పవచ్చు. ఒక విధంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టే కొత్తవారికి శేష్ ఉదాహరణగా నిలుస్తున్నాడు.