Begin typing your search above and press return to search.

సైడ్ B ఇంకా ఎన్నాళ్లు వెయిట్ చేయిస్తారు..?

ఆ తర్వాత వచ్చిన సప్త సాగరాలు దాటి సైడ్ A పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

By:  Tupaki Desk   |   20 Jan 2024 12:20 PM GMT
సైడ్ B ఇంకా ఎన్నాళ్లు వెయిట్ చేయిస్తారు..?
X

కన్నడ పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ స్టార్స్ లో రక్షిత్ శెట్టి ఒకరు. అతను చేసే సినిమాలు ఎంచుకునే కథలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సినిమా పరిమితి పెరగడం వల్ల మొన్నటిదాకా కేవలం కన్నడ వరకే పరిమితమైన రక్షిత్ శెట్టి సినిమాలు ఇప్పుడు సౌత్ భాషలన్నిటిలో రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ 777 చార్లీ సినిమా తెలుగులో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత వచ్చిన సప్త సాగరాలు దాటి సైడ్ A పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

హేమంత్ ఎం రావు డైరెక్షన్ లో రక్షిత్ శెట్టి సొంతంగా నిర్మించిన సినిమా సప్త సాగరాలు దాటి. రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ నటించిన సప్త సాగరాలు దాటి సైడ్ ఏ కన్నడలో సూపర్ హిట్ కాగా రెండు వారాల తర్వాత తెలుగులో రిలీజ్ చేశారు. ప్రేమ కథా చిత్రంగా వచ్చిన సప్త సాగరాలు సైడ్ A తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

లవ్ స్టోరీని రెండు భాగాలుగా చెప్పడం అనేది కొత్త కాన్సెప్ట్. అదే రక్షిత్ శెట్టి సప్త సాగరాలు దాటికి ప్లస్ అయ్యింది. సప్త సాగరాలు దాటి సైడ్ A రిలీజైన ఏడు వారాలకు సైడ్ Bని రిలీజ్ చేశారు. సైడ్ B సినిమా కూడా కన్నడతో పాటు తెలుగులో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తైనా కూడా ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్ అవ్వలేదు. అమేజాన్ ప్రైమ్ లో సైడ్ A అందుబాటులో ఉంది. కానీ 2023 అక్టోబర్ మిడిల్ లో రిలీజైన సైడ్ B ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్ కాలేదు.

సప్త సాగరాలు సైడ్ B OTT రిలీజ్ కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే వారి కోసం ఆ సినిమా హీరో కమ్ ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టి ఒక అనౌన్స్ మెంట్ ఇచ్చారు. సప్త సాగరాలు సైడ్ B అమేజాన్ ప్రైమ్ లో వస్తుందని. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు. ఇన్నాళ్లు వెయిట్ చేయించి మళ్లీ ఈ వెయిటింగ్ ఏంటి బాసు అని రక్షిత్ శెట్టి అనౌన్స్ మెంట్ పై రెస్పాండ్ అవుతున్నారు ఆడియన్స్. సైడ్ B కోసం సౌత్ ఆడియన్స్ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా సైడ్ B ఓటీటీలో బంపర్ హిట్ అయ్యేలా ఉంది. అమేజాన్ ప్రైమ్ సప్త సాగరాలు సైడ్ B ని మంచి డేట్ చూసి వదలాలని చూస్తున్నారు. సైడ్ B కోసం సైడ్ A ని మరోసారి చూసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కూడా ఉన్నారని చెప్పొచ్చు.