Begin typing your search above and press return to search.

బొమ్మరిల్లు × డీజే.. వ్వాటే కాంబినేషన్

ఈ క్రమంలో తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ తో టిల్లు ఓ మూవీ చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది

By:  Tupaki Desk   |   8 Aug 2023 12:07 PM GMT
బొమ్మరిల్లు × డీజే.. వ్వాటే కాంబినేషన్
X

టాలెంటెడ్ యంగ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఒకరు. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సిద్ధుకి, డీజే టిల్లుతో మంచి హిట్ లభించింది. అంతక ముందు కృష్ణ విత్ హిస్ లీల వంటి సినిమాలు తీయగా, అది డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైంది. సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది కానీ, కమర్షియల్ హిట్ మాత్రం డీజే టిల్లుతోనే దక్కింది.

డీజే టిల్లు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ హిట్ కావడానికి సిద్ధునే కారణం అని చెప్పాలి. మూవీలో స్టోరీ కన్నా, సిద్ధు డైలాగులు చెప్పే విధానానికే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు అనుకోవచ్చు. ఇప్పటికీ ఈ మూవీలోని డైలాగ్స్ అందరూ వాడుతూ ఉంటారు.

కాగా, ఇదే హుషారులో ఈ మూవీకి సీక్వెన్స్ మొదలుపెట్టాడు. టిల్లూ స్వ్కేర్ పేరిట తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో సిద్ధు సరసన అనుపమ నటిస్తోంది.

అయితే, ఈ మూవీ తర్వాత సిద్ధూకి ఆఫర్లు క్యూలు కడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ తో టిల్లు ఓ మూవీ చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ మూవీలకు మంచి క్రేజ్ ఉంది. పరుగు, ఆరెంజ్ సినిమాలు చేసిన చాలా కాలం తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో హిట్ కొట్టాడు. ఇప్పుడు సిద్ధు తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట.

ఇప్పటికే స్టోరీ వినిపించాడట. సిద్ధూకి కూడా నచ్చడంతో ఒకే చేసినట్లు తెలుస్తోంది. అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన బాపినీడు, ఈ సినిమాకి నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే లాంఛనంగా ఈ మూవీని ప్రారంభించనున్నారట. అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.

ఇదిలా ఉండగా, మరో స్టార్ డైరెక్టర్ సినిమాలో కూడా సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. అది కూడా ఓ రీమేక్ మూవీ అని తెలుస్తోంది. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.