Begin typing your search above and press return to search.

యాంక‌ర్ వ‌ర్డింగ్ కి స్ట‌న్ అయిన‌ టిల్లుబాబు!

`టిల్లు స్వ్కేర్` రిలీజ్ కి ఒక్క‌రోజే స‌మ‌యం ఉండ‌టంతో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌...అనుప‌మ అన్నీ మీడియా సంస్థ‌ల్ని చుట్టేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 March 2024 8:08 AM GMT
యాంక‌ర్ వ‌ర్డింగ్ కి స్ట‌న్ అయిన‌ టిల్లుబాబు!
X

`టిల్లు స్వ్కేర్` రిలీజ్ కి ఒక్క‌రోజే స‌మ‌యం ఉండ‌టంతో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌...అనుప‌మ అన్నీ మీడియా సంస్థ‌ల్ని చుట్టేస్తున్నారు. గ్యాప్ లేకుండా ఇంట‌ర్వ్యూలు ఇస్తూ మీడియాలోనే క‌నిపిస్తున్నారు. సినిమా సంగ‌తుల‌తో పాటు ఆన్ సెట్స్ విశేషాల్ని పంచుకుంటున్నారు. అస‌లే టిల్లుబాబు టైమింగ్ కామెడీకి వీరాభి మానులున్నారు. సిద్దు ఏం మాట్లాడినా జ‌నాల్లోకి వాయు వేగంతో దూసుకుపోతుంది. పైగా వెంట అనుప‌మ కూడా ఉంది. అంత‌టి వేగంలో ఇలాంటి తేడాలు జరిగితే ఇంకేమైనా ఉందా? నెట్టింట

పెను సంచ‌లన‌మైపోదు.

స‌రిగ్గా అలాంటి పొర‌పాటు జ‌స్ట్ మిస్ అయింది అన్న సంగ‌తి ఎంత మందికి తెలుసు. అవును ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సిద్దు..అనుప‌మ ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్నారు. ఇంట‌ర్వ్యూ ప్రారంభానికి ముందు ఇద్ద‌రు జోకులేసుకుని న‌వ్వుకుంటున్నారు. అందులో అనుప‌మ ఇంకాస్త జోష్ గా క‌నిపిస్తుంది. అదే స‌మ‌యంలో యాంక‌ర్ సెట్స్ లో కూడా ఇంతే స‌ర‌దాగా ఉంటారా? ఇంతే ఉత్సాహంగా క‌నిపిస్తారా? అనే ప్ర‌శ్న వేసింది.

ఆ స‌య‌యంలో సిద్దు ప‌ర‌జ్ఞానంలో ఉన్నాడు. సెట్స్ అనే ప‌దం యాంక‌ర్ నోట రాగానే..వాట్? అని ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్య‌పోయాడు. అది సెట్స్ అనే ప‌ద‌మా? మ‌రో ప‌ద‌మా? అని షాక్ అయ్యాడు. సిద్దు ఆశ్చ‌ర్యాన్ని చూసిన అనుప‌మ ప‌డిప‌డి న‌వ్వేసింది. వెంట‌నే సెట్స్ అని చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. దీంతో వెంట‌నే? సిద్దు ప‌ర‌జ్ఞానం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఆ వెంట‌నే యాంక‌ర్ కూడా న‌వ్వు అందుకుంది. ఆ న‌వ్వు పీక్స్ కి చేరుతుంది.

ఓకింత సిగ్గుని ఒల‌క‌బోసింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. అస‌లే అనుప‌మ‌ని ఉద్దేశించి కొన్ని ఇబ్బందిక‌ర కామెంట్లు వ‌చ్చాయ‌ని నిన్న‌టి రోజున సిద్దు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అలాంటి కామెంట్లు వ‌ద్దు అని...హుందాగా ఉందామ‌ని చిన్న‌పాటి క్లాస్ పీకిన సంగ‌తి విధిత‌మే. ఇంత‌లో ఈ వీడియో రావ‌డం...ఆయ‌న అపార్దం చేసుకోవ‌డం ఇంట్రెస్టింగ్.