Begin typing your search above and press return to search.

సిద్దు జొన్నలగడ్డ.. మళ్ళీ రిస్క్ లో పడకుండా..

ఇటీవల ఈ మూవీ విడుదలై డీజే టిల్లుకు మించిన హిట్ అయింది.

By:  Tupaki Desk   |   1 May 2024 4:30 AM GMT
సిద్దు జొన్నలగడ్డ.. మళ్ళీ రిస్క్ లో పడకుండా..
X

డీజే టిల్లుతో టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ చిత్రం. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు సిద్ధు. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో టిల్లు స్క్వేర్ చేశారు. ఇటీవల ఈ మూవీ విడుదలై డీజే టిల్లుకు మించిన హిట్ అయింది.

అయితే టిల్లు స్క్వేర్ పూర్తయ్యే వరకు ఇతర కమిట్మెంట్స్ పెట్టుకోకూడదని బలంగా ఫిక్స్ అయ్యారు. అందుకే టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యే ముందు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ జాక్ సినిమా స్టార్ట్ చేశారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. అందులో సిద్ధు యాక్షన్ మోడ్ లో రెండు గన్స్ పట్టుకుని కనిపించారు.

మోషన్ పోస్టర్ ను బట్టి ఈ సినిమా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మూవీలో సిద్ధు రోల్ కోసం నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో స్టార్ బాయ్ ను భాస్కర్ కొత్తగా చూపించబోతున్నారట. ఇప్పటి వరకు కామెడీ యాంగిల్ లో మెప్పించిన సిద్ధు.. ఈ మూవీ కోసం వేషం మార్చారని తెలుస్తోంది. తన రోల్ కు మేకర్స్ కాస్త యాక్షన్ టచ్ కూడా ఇచ్చారట.

ఈ విషయం పై సినీ పండితులు కూడా స్పందిస్తున్నారు. జాక్ సినిమాతో కొత్తగా ఆకట్టుకునేందుకు సిద్ధు జొన్నలగడ్డకు ఒక మంచి ఛాన్స్. టిల్లు ఇమేజ్ ఉండాలి కానీ ప్రతీసారి అదే అంటే కుదరదు కదా, అందుకే వీలైనంత వరకు కొత్తగా ట్రై చేయాలి. ఆడియన్స్ ను వేరే జానర్, క్యారెక్టరైజేషన్స్ తో మెప్పించాల్సిన బాధ్యత సిద్ధుపైన ఉంది. కాబట్టి దీంతో అతను కొత్తగా నిరూపంచుకోవడానికి కావాల్సినంత స్పెస్ అయితే ఉంది.

ఇక ఫస్ట్ టైమ్ గన్ పట్టుకుని కనిపించడంతో జాక్ సినిమాలో ఏమైనా పోలీస్ ఆఫీసర్ గా సిద్ధు కనిపిస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ మూవీ టైటిల్ కింద 'కొంచెం క్రాక్' అని రాసి ఉంది. ఆ టాగ్ లైన్.. సిద్ధు క్యారెక్టర్ ను సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో సిద్ధుకు జోడీగా వైష్ణవి చైతన్య నటిస్తోంది. మరి ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.