Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : టిల్లు గాడి 'బేబీ' ని చూశారా...!

ఇప్పటికే దిల్‌ రాజు బ్యానర్‌ లో ఏకంగా మూడు సినిమాలకు కమిట్ అయ్యింది అనే వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   4 Jan 2024 8:04 AM GMT
పిక్ టాక్‌ : టిల్లు గాడి బేబీ ని చూశారా...!
X

యూట్యూబ్‌ షార్ట్‌ ఫిల్మ్స్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య. ఈ అమ్మడు బేబీ అనే చిన్న చిత్రంలో నటించి.. ఆ చిత్రం పెద్ద విజయం సాధించడంతో ఓవర్‌ నైట్ స్టార్‌ గా నిలిచింది. హీరోయిన్‌ గా వైష్ణవి చైతన్య బ్యాక్ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.


ఇప్పటికే దిల్‌ రాజు బ్యానర్‌ లో ఏకంగా మూడు సినిమాలకు కమిట్ అయ్యింది అనే వార్తలు వచ్చాయి. తాజాగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ బ్యానర్‌ లో బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈ బేబీ బ్యూటీ నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

నేడు వైష్ణవి చైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ అమ్మడి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను యూనిట్‌ సభ్యులు రివీల్‌ చేయడం జరిగింది. పోస్టర్‌ లో వైష్ణవి లుక్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బ్లాక్‌ డ్రెస్ ధరించిన వైష్ణవి చైతన్య, బ్లాక్ దుప్పట్టా ను తలపై ధరించడం ద్వారా చాలా పద్దతిగా కనిపిస్తుంది.

ఈ రేంజ్‌ లో అందంగా కనిపిస్తున్న వైష్ణవి చైతన్య కచ్చితంగా డీజే టిల్లు ఫేమ్‌ సిద్దు జొన్నలగడ్డకి సరి జోడీ అన్నట్లుగా నిలుస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిల్‌ రాజు సినిమాలకు సంబంధించిన లుక్‌ ను కూడా నేడు వైష్ణవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసి ఉంటే బాగుండేది అని కొందరు ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.