Begin typing your search above and press return to search.

హాలీవుడ్ టైటిల్.. ఫుల్ యాక్షన్ మోడ్ లో డీజే టిల్లు

డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఎంత క్రేజ్‌ ను సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Feb 2024 10:05 AM GMT
హాలీవుడ్ టైటిల్.. ఫుల్ యాక్షన్ మోడ్ లో డీజే టిల్లు
X

డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఎంత క్రేజ్‌ ను సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఈ క్రేజ్‌ను కంటిన్యూ చేయడం కోసమే గత సంవత్సరం నుంచి డీజే టిల్లు సీక్వెల్‌ పై వర్క్ చేస్తున్నారు. ఇది పూర్తయ్యే వరకు ఇతర కమిట్మెంట్స్ పెట్టుకోకూడదని బలంగా ఫిక్స్ అయ్యారట.

ఇప్పుడు డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తైంది. రిలీజ్ కు కూడా రెడీ అవుతోంది. దీంతో సిద్ధు ఇప్పుడు తన అప్‌ కమింగ్ ప్రాజెక్ట్స్‌ పై ఫోకస్ పెట్టారు. వరుస ప్రాజెక్ట్స్ కు కమిట్ అవుతూ దూసుకెళ్తున్నారు. రీసెంట్ గానే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. SVCC37 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

బుధవారం సిద్ధు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి జాక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇందులో సిద్ధు యాక్షన్ మోడ్ లో తన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా రెండు చేతుల్లో గన్స్ తో కనిపించారు.

అందులో ఒకటి ఒరిజినల్ గన్ కాగా, మరొకటి బొమ్మ తుపాకీ. మోషన్ పోస్టర్ ను బట్టి ఈ సినిమా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని అర్థమవుతోంది. ఫస్ట్ టైం సిద్ధు గన్ పట్టుకొని కనిపించడంతో సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా హీరో కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఇక జాక్ అనే టైటిల్ కింద కొంచెం క్రాక్ అని రాసి ఉంది.

ఈ ట్యాగ్ లైన్ సినిమాలో సిద్ధు క్యారెక్టర్ ను తెలియపరిచేలా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మొత్తానికి ఈ సినిమాలో ఓ సరికొత్త సిద్ధును బొమ్మరిల్లు భాస్కర్ చూపించడం గ్యారెంటీ అని అర్థమవుతోంది. బేబీ మూవీతో సూపర్ క్రేజ్ అందుకున్న వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే మూవీలో హీరోయిన్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉండడంతో వైష్ణవి చైతన్యను మేకర్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.