Begin typing your search above and press return to search.

మరో 100 సినిమా రెడీ చేస్తున్నాడా..?

ఈ సినిమాతో సిద్ధు మరోసారి 100 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడు. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత గ్యాప్ తీసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ జాక్ అంటూ వస్తున్నాడు.

By:  Tupaki Desk   |   13 May 2024 2:30 PM GMT
మరో 100 సినిమా రెడీ చేస్తున్నాడా..?
X

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో సూపర్ హిట్ అందుకుని తన స్టామినా ఇది అని ప్రూవ్ చేసుకున్నాడు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈ రేంజ్ సక్సెస్ జోష్ ని ఎంజాయ్ చేసేందుకు అతను దాదాపు పుష్కర కాలం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందుకే అతని సక్సెస్ ని కేవలం సిద్ధు మాత్రమే కాదు అతని కెరీర్ మొదటి నుంచి చూస్తున్న ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పాత్రలతో మొదలై ఇప్పుడు 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమా హీరోగా సిద్ధు సెల్ఫ్ మేడ్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

డీజే టిల్లు సూపర్ హిట్ తర్వాత టిల్లు స్క్వేర్ మీద విపరీతమైన ప్రెజర్ ఉంది. అయితే ఆ ప్రెజర్ ని తట్టుకుని ఆడియన్స్ కు కావాల్సిన ఫన్ ని ఇచ్చి టిల్లు స్క్వేర్ తో సూపర్ సక్సెస్ అందుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. రైటింగ్ లో తన మార్క్ చూపిస్తున్న సిద్ధు టిల్లు స్క్వేర్ తో మరింత బాధ్యత నెత్తిన వేసుకున్నాడని చెప్పొచ్చు. టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు చేస్తున్న సినిమా ఒకటి జాక్ కాగా మరొకటి తెలుసు కదా. తెలుసు కదా ఒక లవ్ స్టోరీగా వస్తుంది.

జాక్ సినిమా మాత్రం మరోసారి సిద్ధు రేంజ్ సినిమాగా ఉండబోతుందని అంటున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ జాక్ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమాతో సిద్ధు మరోసారి 100 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడు. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత గ్యాప్ తీసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ జాక్ అంటూ వస్తున్నాడు.

అసలైతే ఈ కథను ధనుష్ తో చేయాలని అనుకున్నాడట బొమ్మరిల్లు భాస్కర్. మరి ఆయన కాదన్నాడో ఏమో కానీ సిద్ధు తో జాక్ మొదలు పెట్టాడు. టిల్లు స్క్వేర్ సెన్సేషనల్ హిట్ అవ్వడం వల్ల సిద్ధు చేస్తున్న ఈ జాక్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమాతో కూడా సిద్ధు 100 కోట్లు కొడతాడా.. టైర్ 2 హీరోగా సిద్ధు నిలకడగా తన సక్సెస్ మేనియా కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి. ఎస్.వి.సి.సి బ్యానర్ లో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సిద్ధు సరసన బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తుంది.