Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : లుంగీ ఎత్తి మరీ క్లారిటీ ఇచ్చిన టిల్లు

సిద్దు జొన్నలగడ్డ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అయినా కూడా గుర్తింపు దక్కింది మాత్రం ఆ మధ్య వచ్చిన డీజే టిల్లు వల్లే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

By:  Tupaki Desk   |   27 Oct 2023 6:41 AM GMT
పిక్ టాక్‌ : లుంగీ ఎత్తి మరీ క్లారిటీ ఇచ్చిన టిల్లు
X

సిద్దు జొన్నలగడ్డ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అయినా కూడా గుర్తింపు దక్కింది మాత్రం ఆ మధ్య వచ్చిన డీజే టిల్లు వల్లే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే సిద్దు జొన్నలగడ్డ కి డీజే టిల్లు సినిమా చాలా స్పెషల్‌. ఇప్పుడు సిద్దు మరోసారి టిల్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.


టిల్లు స్క్వేర్ టైటిల్ తో రాబోతున్న ఈ సీక్వెల్‌ సినిమా విడుదల విషయంలో ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తోంది. పదే పదే వాయిదా వేస్తూ ప్రేక్షకుల సహనంకు పరీక్ష పెడుతున్నారు. మొదట అనుకున్న తేదీకి షూటింగ్‌ పూర్తి అవ్వక పోవడంతో విడుదల చేయలేక పోయారు. ఆ తర్వాత అనుకున్న తేదీకి ఏమైంది... ఆతర్వాత అనుకున్న తేదీ ఏమైందో.. కానీ ఇప్పుడు కొత్త తేదీని అధికారికంగా ప్రకటించారు.

సిద్దు టిల్లు స్క్వేర్ సినిమా ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 9న ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇస్తూ విడుదల చేసిన పోస్టర్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పట్టు లుంగీ, పట్టు షర్ట్‌ ను ధరించిన టిల్లు గాడు అదే మాస్ ఫోజ్ తో ప్రేక్షకులను సర్‌ ప్రైజ్‌ చేశాడు.

లుంగీ ఎత్తి మరీ ఈసారి విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. సినిమా వచ్చే నెలలో విడుదల ఉంటుందని ఆశించిన సిద్దు జొన్నలగడ్డ అభిమానులకు నిరాశ కలిగించేలా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. అయితే ఈ పోస్టర్ లో సిద్దును ఇలా మాస్ గా చూసి చాలా మంది వెయిట్‌ చేసినా కూడా ఫలితం దక్కేలా ఉంది. టిల్లు స్క్వేర్ సినిమా కచ్చితంగా మంచి ఎంటర్‌టైన్మెంట్‌ ను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.