Begin typing your search above and press return to search.

లేడి డైరెక్టర్ తో సిద్దు.. ఓ థ్రిల్లింగ్ కథ

ఈ లోగా సిద్ధు టిల్లు స్క్వేర్​ సీక్వెల్ కూడా పూర్తైపోతుంది. ఇక సినిమా ప్రారంభమైన నాలుగు నెలల్లలోనే కంప్లీట్ చేయాలని నందిని రెడ్డి టార్గెట్​ పెట్టుకున్నారట.

By:  Tupaki Desk   |   13 Oct 2023 1:30 AM GMT
లేడి డైరెక్టర్ తో సిద్దు.. ఓ థ్రిల్లింగ్ కథ
X

దర్శకురాలు నందినిరెడ్డితో డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నల్ల గడ్డ ఓ సినిమా చేస్తారన్న ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లనుందని అంతా అంటున్నారు. అయితే తాజాగా ఈ వివరాల గురించి సమాచారం అందింది.

వివరాళ్లోకి వెళితే.. అల మొదలైంది, జబర్దస్త్​, కల్యాణ వైభోగమే, ఓ బేబీ, పిట్ట కథలు వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు నందిని రెడ్డి. అయితే ఈమెకు 2019లో ఓ బేబీ సినిమా తర్వాత హిట్ పడలేదు. ఆ తర్వాత ఈమె చేసిన పిట్ట కథలు, అన్ని మంచి శకునములే(2023) చిత్రాలు బక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు.

అయితే ఈమె హీరోయిన్ సమంతతో కలిసి ఓ సినిమా చేయాలని ఆశించింది. ఇందులో హీరో రోల్​కు సిద్ధు జొన్నల్లగడ్డను తీసుకుందని తెలిసింది. కానీ రీసెంట్​గా ఈ మూవీ సమంత చేయట్లేదని వార్తలు వచ్చాయి. దీంతో ఆమె స్థానంలో మరో కొత్త హీరోయిన్​ను పరిచయం చేయాలని నందిని రెడ్డి అనుకుంటున్నారట. ఆమె కోసం వెతుతుకున్నారట.

అలానే తాజాగా అందిన సమాచారం ప్రకారం .. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రధమార్థంలో సెట్స్​పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారట. ఈ లోగా సిద్ధు టిల్లు స్క్వేర్​ సీక్వెల్ కూడా పూర్తైపోతుంది. ఇక సినిమా ప్రారంభమైన నాలుగు నెలల్లలోనే కంప్లీట్ చేయాలని నందిని రెడ్డి టార్గెట్​ పెట్టుకున్నారట.

మొత్తం షూటింగ్​ను హైదరాబాద్​లోనే చేయబోతున్నట్లు టాక్​ వినిపిస్తోంది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్​టైనర్​గా పక్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కబోతుందని తెలిసింది. సినిమా సూపర్ నేచురల్​ టచ్​తో రూపొందిస్తున్నారట.

ఇకపోతే నందిని రెడ్డి చివరిగా ఈ ఏడాది సంతోశ్ శోభన్​ - మాళవిక నాయర్​తో అన్నీ మంచి శకునములే చిత్రం చేశారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఆశించిన స్థాయిలో ఆడలేదు. చూడాలి మరి ఇప్పుడు ఈ కొత్త సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో...