Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ నిన్ను పరిశోధిస్తోంది 'జాక్'

స్టార్ బాయ్ గా ప్రస్తుతం యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయిన సిద్దు జాక్ తో తనలో కొత్త యాంగిల్ ని బయటకి తీసుకొస్తాడని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   10 April 2024 4:45 AM GMT
బాక్సాఫీస్ నిన్ను పరిశోధిస్తోంది జాక్
X

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.. టిల్లు స్క్వేర్ మూవీతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఈ మూవీ సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. లాంగ్ రన్ లో ఇంకా ఎక్కువ రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉంది. టిల్లు అందించే ఫన్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయారు. ఈ కారణంగానే మొదటి సినిమా కంటే భారీ కలెక్షన్స్ ని టిల్లు స్క్వేర్ కొల్లగొడుతోంది. ఇప్పటికే నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చింది. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ కూడా లాభాల్లో కొనసాగుతున్నారు.

టిల్లు స్క్వేర్ తో సిద్దు ఇప్పుడు స్టార్ బాయ్ అనే పేరుకి తగ్గ ఇమేజ్ తెచ్చుకున్నాడు. దీంతో అతని నెక్స్ట్ సినిమాలపై హైప్ అమాంతం పెరిగిపోయింది. నీరజ కోన దర్శకత్వంలో సిద్దు హీరోగా తెలుసు కదా అనే మూవీ తెరకెక్కుతోంది. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే మూవీ కూడా సిద్ధం అవుతోంది. ఈ రెండు సినిమాలు కూడా సిద్దు ఇమేజ్ కి సరిపోయే రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లుగానే సిద్ధం అవుతున్నాయి.

జాక్ మూవీని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేసినట్లు తెలుస్తోంది. మూవీలో సిద్దుకి జోడీగా తెలుగు క్రేజీ బ్యూటీ బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తోంది. ఆ మధ్యకాలంలో జాక్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అందులో సిద్దు రెండు చేతులతో రెండు గన్స్ పట్టుకొని, కళ్ళజోడు పెట్టుకొని, గోడకి ఆనుకొని ఉన్నాడు. ఈ స్టిల్ అందరికి కనెక్ట్ అయ్యింది.

ఇదిలా ఉంటే టిల్లు స్క్వేర్ సూపర్ సక్సెస్ కావడంతో జాక్ సినిమాకి డిస్టిబ్యూటర్స్ ని సాలిడ్ ఆఫర్స్ వస్తున్నాయంట. గతంలో కంటే ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి రైట్స్ కోసం ఎక్కువ మొత్తం ఇవ్వడానికి ముందుకొస్తున్నారంట. బిజినెస్ పరంగా జాక్ మూవీ టిల్లు స్క్వేర్ ని బీట్ చేస్తుందనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ నుంచి వస్తున్న డిఫరెంట్ మూవీ కావడంతో కొంత హైప్ క్రియేట్ అవుతోంది.

స్టార్ బాయ్ గా ప్రస్తుతం యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయిన సిద్దు జాక్ తో తనలో కొత్త యాంగిల్ ని బయటకి తీసుకొస్తాడని తెలుస్తోంది. వైష్ణవి చైతన్యకి కూడా ఈ మూవీ కమర్షియల్ హీరోయిన్ గా బ్రేక్ ఇస్తుందనే ప్రచారం నడుస్తోంది. ఏది ఏమైనా సిద్దుకి ఉన్న క్రేజ్, ఇమేజ్ నెక్స్ట్ అతని నుంచి రాబోయే రెండు, మూడు సినిమాల వరకు బిజినెస్ పరంగా ఉపయోగపడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.