Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్ & స్టార్ బాయ్.. మంచి ఛాన్స్ కొట్టేశారు!

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టాలెంటెడ్ హీరోలు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ & స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.

By:  Tupaki Desk   |   28 March 2024 8:29 AM GMT
రౌడీ స్టార్ & స్టార్ బాయ్.. మంచి ఛాన్స్ కొట్టేశారు!
X

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టాలెంటెడ్ హీరోలు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ & స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ ప్రారంభించిన వీళ్ళిద్దరూ.. ఆ తర్వాత రోజుల్లో హీరోలుగా మారి స్వయంకృషితో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే యంగ్ హీరోలిద్దరూ ఈసారి సమ్మర్ సీజన్ లో సినీ వినోదాన్ని అందించాడని బాక్సాఫీసు బరిలో దిగుతున్నారు. ఒక వారం గ్యాప్ లో ఇద్దరూ తమ సినిమాలను రిలీజ్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''టిల్లు స్క్వేర్''. రెండేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్ ఇది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమా బ్యానర్స్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఫైనల్ గా రేపు శుక్రవారం (మార్చి 29) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" మూవీ కూడా ఈ సీజన్ లోనే రాబోతోంది. పరశురామ్‌ పెట్లా దీనికి దర్శకుడు. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శక హీరోల కాంబినేషన్ లో వస్తోన్న చిత్రమిది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు - శిరీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇలా ఒక వారం తేడాతో సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండల కొత్త సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇందులో ఒకటి యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అయితే, మరొకటి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాల ప్రమోషనల్ మెటీరియల్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' థియేట్రికల్ ట్రైలర్, 'టిల్లు స్క్వేర్' రిలీజ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. అంచనాలు రెట్టింపు అయ్యేలా చేశాయి.

నిజానికి విజయ్, సిద్ధూల సినిమాలకి మంచి రిలీజ్ డేట్లు దొరికాయని చెప్పాలి. సాధారణంగా సమ్మర్ సీజన్ లో భారీ బడ్జెట్ చిత్రాలు, పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతుంటాయి. కానీ ఈసారి ఒక్క పెద్ద మూవీ కూడా లేదు. వేసవిలో థియేటర్ లలోకి రానున్న చిత్రాల్లో టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ లకు మాత్రమే ఎక్కువ క్రేజ్ వుంది. దీనికి తోడు ఇప్పటికే కొన్ని తరగతుల వారికి పరీక్షలు అయిపోయాయి. రాబోయే రోజుల్లో గుడ్ ఫ్రైడే, బాబు జగ్జీవన్‌రావ్ జయంతి, ఉగాది, రంజాన్, శ్రీరామ నవమి వంటి పబ్లిక్ హాలిడేస్ కూడా ఉన్నాయి.

టాక్ బాగుంటే ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టడమే అవకాశం ఉంటుంది. సమ్మర్ సీజన్ రెండు నెలలకు పైగా ఉంటుంది కాబట్టి, లాంగ్ రన్ లో భారీ వసూళ్లు సాధించవచ్చు. ఇటీవల కాలంలో ఓ మోస్తరు క్రేజ్ ఉన్న హీరోల సినిమాలేవీ పెద్దగా రాకపోవడంతో, ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా 'టిల్లు స్క్వేర్', 'ఫ్యామిలీ స్టార్' చిత్రాలకు ఈ వేసవి కాలం బాగా కలిసొచ్చినట్లే. దీన్ని క్యాష్ చేసుకోగలిగితే విజయ్ దేవరకొండ, సిద్దు జొన్నలగడ్డల మార్కెట్ మరింత పెరుగుతుంది. ఇది వాళ్లిద్దరి కెరీర్ కు ఎంతో ప్లస్ అవుతుంది.

కాకపోతే ఇద్దరు కుర్ర హీరోల సినిమాలకు ఐపీఎల్ లీగ్ రూపంలో ముప్పు పొంచి వుంది. తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ ను విపరీతంగా ఆదరిస్తారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఐపీఎల్ మ్యాచ్ లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇది కచ్ఛితంగా ఈవెనింగ్, సెకండ్ షోల కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని గతంలో ఎన్నో సందర్భాల్లో రుజువైంది. కానీ సినిమాకి మంచి టాక్ వస్తే క్రికెట్ కూడా అడ్డుకోలేదనే విషయం కూడా పలు సందర్భాల్లో ప్రూవ్ అయింది. కాబట్టి 'టిల్లూ స్క్వేర్' & 'ఫ్యామిలీ స్టార్' పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగితే.. ఐపీఎల్‌ కూడా వాటిని ఏం చెయ్యలేదు. ఇప్పటికే రెండు సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లుగా తెలుస్తోంది. మరి బాక్సాఫీసు దగ్గర ఏం జరుగుతుందో వేచి చూడాలి.