Begin typing your search above and press return to search.

టిల్లు స్క్వేర్ క్లైమాక్స్ షాకిస్తుంది!

తాజా ఇంటర్వ్యూలో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని, డీజే టిల్లుని మించిన ట్విస్టులంటాయ‌ని అన్నారు.

By:  Tupaki Desk   |   27 March 2024 3:39 PM GMT
టిల్లు స్క్వేర్ క్లైమాక్స్ షాకిస్తుంది!
X

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన `డిజె టిల్లు` బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ `టిల్లు స్క్వేర్` మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీక్వెల్ క‌థ‌తో తెర‌కెక్కిన‌ ఈ సినిమాపై క్రేజీ బజ్ నెల‌కొంది. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవ‌లే విడుద‌లైన టిల్లు స్క్వేర్ ట్రైల‌ర్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. మొద‌టి భాగాన్ని మించి వినోదానికి కొద‌వేమీ లేదని ట్రైల‌ర్ భ‌రోసానిచ్చింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని, డీజే టిల్లుని మించిన ట్విస్టులంటాయ‌ని అన్నారు. అమ్మాయి వ‌ల్ల మోస‌పోయే కుర్రాడిగా సిద్ధూ మొద‌టి భాగంలో క‌నిపించాడు. ఇప్పుడు సీక్వెల్లోను అదే త‌ర‌హా. ఈసారి అమ్మాయి వ‌ల్ల మోసం టూమ‌చ్ గా ఉంటుంద‌ని కూడా సిద్ధూ ట్రైల‌ర్ లోనే చెప్పేశాడు. ఆ పాయింట్ ఏమిటి? అన్న‌ది ఆస‌క్తిని క‌లిగించింది. అలాగే టిల్లుతో అనుప‌మ రొమాన్స్, లిప్ లాక్ లు యువ‌త‌రాన్ని థియేట‌ర్ల‌కు లాగుతాయ‌న‌డంలో సందేహం లేదు. క్యూట్ అనుప‌మ రెచ్చిపోయి వేడెక్కించే సీన్ల‌లో న‌టించింది. తన కెరీర్ ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాల‌నే ప్ర‌య‌త్నంలో స‌న్నివేశం డిమాండ్ మేర‌కు అనుప‌మ ప‌ట్టు విడుపుకు సిద్ధ‌మయ్యాన‌ని ఇటీవ‌లి ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టంగానే చెప్పింది. ఇవ‌న్నీ టిల్లు స్క్వేర్ కి ప్ర‌ధాన అస్సెట్ కానున్నాయి.

టిల్లూ ఫ్రాంచైజీలో మూడవ భాగం క‌చ్ఛితంగా ఉంటుందని కూడా ఇప్పటికే చిత్ర‌బృందం లీకుల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. క్లైమాక్స్‌లో కొత్తగా స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్‌కి గురి చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి సీక్వెల్స్ ట్రెండ్ లో డిజే టిల్లు ఫ్రాంఛైజీకి బాగా క‌లిసి రానుంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.