విశ్వక్ సేన్ - సిద్దు జొన్నల గడ్డతో లేడీ స్టార్స్!
ఎనర్జిటిక్ స్టార్స్ విశ్వక్ సేన్-సిద్దు జొన్నల గడ్డ గురించి పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ట్యాలెంట్ తో ఎదిగిన నటులు
By: Tupaki Desk | 24 April 2025 8:45 AM ISTఎనర్జిటిక్ స్టార్స్ విశ్వక్ సేన్-సిద్దు జొన్నల గడ్డ గురించి పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ట్యాలెంట్ తో ఎదిగిన నటులు. నటనతో పాటు రైటింగ్స్ స్కిల్స్ కూడా ఉండటంతో ఇండస్ట్రీలో వేగంగా ఎదగలిగారు. తమను తాము స్టార్లగా తీర్చిదిద్దుకోవడంలో వాళ్ల పాత్ర ఎంతో కీలక మైంది. ప్రస్తుతం యంగ్ హీరోలిద్దరికీ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.
తాజాగా యంగ్ హీరోలిద్దరిపై లేడీ ప్రొడ్యూసర్స్ కన్ను పడింది. సిద్దు-విశ్వక్ తో మరో ఎనర్జిటిక్ చిత్రాన్ని నిర్మించడానికి ఆసక్తిగా ఉన్నారు. ఇంతకీ ఎవరా లేడీ ప్రొడ్యూసర్స్ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. అగ్ర నిర్మాత అశినీదత్ వారసురాళ్లుగా ఇండస్ట్రీకి వచ్చిన అక్కా-చెల్లెళ్లు ప్రియాంకాదత్-స్వప్నాదత్ నిర్మాత లుగా నేడు ఏ స్థాయిలో ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. తండ్రిని మించిన తనయురాళ్లగా పరిశ్రమలో రాణిస్తున్నారు.
మూసలో వెళ్తోన్న తెలుగు సినిమా నిర్మాతలకు కొత్త తరహా కంటెంట్ ని పరిచయం చేసి మార్కెట్ లో బ్రాండ్ అయ్యారు. సావిత్రి , ఎన్టీఆర్, కల్కీ 2898 లాంటి సినిమాలు వెండి తెరపై మెరిసాయంటే కారణం వాళ్లే. వాళ్ల చొరవతోనే ఈ చిత్రాలు సాధ్యమయ్యాయి. అలాంటి గట్స్ ఉన్న నిర్మాతలు సిద్దు-విశ్వక్ తో ఓ సినిమాకి చర్చలు జరుపుతున్నారని తెలిసింది.
ఈ సినిమాతో మరో యువ దర్శకుడిని పరిచయం చేయాలని చూస్తున్నారుట. ఇప్పటికే స్టోరీ లాక్ అయిందని...యంగ్ హీరోల ఇద్దరి ఎనర్జిటిక్ పెర్పార్మెన్స్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న వినూత్న స్క్రిప్ట్ ఇదని సమాచారం.
