సిద్ధు స్పెషల్ ఫోకస్ తో ఆ ప్రాజెక్ట్..!
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో సూపర్ హిట్ అందుకుని 100 కోట్ల క్లబ్ లో కూడా జాయిన్ అయిన హీరో సిద్ధు జొన్నలగడ్డ.
By: Tupaki Desk | 5 May 2025 10:30 PMడీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో సూపర్ హిట్ అందుకుని 100 కోట్ల క్లబ్ లో కూడా జాయిన్ అయిన హీరో సిద్ధు జొన్నలగడ్డ. కెరీర్ లో ఒక్కో స్టెప్ వేస్తూ వచ్చిన సిద్ధు ఈ రేంజ్ క్రేజ్ తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. డీజే టిల్లు క్యారెక్టర్ ని సిద్ధు అభినయించిన తీరు ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేసింది. ఐతే డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ రెండు సినిమాల తర్వాత రీసెంట్ గా జాక్ అనే సినిమాతో వచ్చాడు సిద్ధు. ఆ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నా కూడా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది.
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన జాక్ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. బేబీతో యూత్ ఆడియన్స్ కి ఫేవరెట్ అయిన వైష్ణవి సిద్ధు జాక్ తో హిట్ కొట్టేస్తుందని అనుకున్నారు. కానీ జాక్ వాళ్ల ప్లాన్స్ అన్నిటినీ రివర్స్ చేసింది. జాక్ సినిమా సిద్ధు కెరీర్ కి పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే డైరెక్టర్, హీరో మధ్య కాస్త డిస్టబన్స్ ఉందన్న టాక్ వినిపించింది. ఐతే సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ లో అలాంటిది ఏమి లేదని చెప్పినా సినిమా చూశాక వారి కో ఆర్డినేషన్ ఎలా ఉందో అర్థమైంది.
టిల్లు రోల్ హిట్ అయ్యింది కదా అని సిద్ధు అదే పంథాలో మిగతా సినిమాలు చేస్తున్నాడు. జాక్ సినిమాలో చాలా సార్లు టిల్లు ఇలా వచ్చి అలా వెళ్లినట్టు అనిపిస్తుంది. ఐతే జాక్ నిరాశపరచడంతో సిద్ధు నెక్స్ట్ చేస్తున్న సినిమా మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నాడు. నీరజ కోన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జాక్ ఇంపాక్ట్ పడకుండా సిద్ధు ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
సిద్ధు తెలుసు కదా సినిమా అతని తరహా క్యారెక్టరైజేషన్ అయినా కథ కథనాలు ప్రేక్షకులను అలరిస్తాయని అంటున్నారు. లేటెస్ట్ గా హిట్ 3 తో సూపర్ హిట్ అందుకున్న శ్రీనిధి శెట్టి ఈ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సిద్ధుని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అన్నది చూడాలి. సిద్ధు జాక్ సినిమా అసలైతే సమ్మర్ రిలీజ్ అనుకున్నారు కానీ అది కుదిరేలా లేదు.