స్టార్‌బాయ్ సిద్దూతో క్రేజీ డైరెక్టర్ సినిమా కాదా?
ప్రస్తుతం రవికాంత్ పేరేపు డైరెక్ట్ చేస్తున్న మూవీలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
By: Tupaki Entertainment Desk | 16 Feb 2026 3:39 PM ISTస్టార్ బాయ్ సిద్ధూ డీజె టిల్లు, `టిల్లూ స్క్వేర్ సినిమాలతో తనదైన మార్కు క్రైమ్ కామెడీ సినిమాలని అందించిన బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్‌లని సొంతం చేసుకున్నాడు. మంచి మార్కెట్‌ని ఏర్పరచుకున్న సిద్దూ జొన్నలగడ్డ ఆ తరువాత స్పై కామెడీ డ్రామా అంటూ చేసిన `జాక్`, రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో చేసిన `తెలుసు కదా` చిత్రాలు బ్యాక్‌టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశకు గురి చేశాయి. ప్రస్తుతం రవికాంత్ పేరేపు డైరెక్ట్ చేస్తున్న మూవీలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
ఇదిలా ఉంటే సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో వరుసగా సక్సెస్‌లని సొంతం చేసుకుని క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరితో కలిసి సిద్దూ జొన్నలగడ్డ ఓ క్రేజీ ప్రాజెక్ట్ని చేయబోతున్నాడని తెలిసింది. ప్రస్తుతం వెంకీ అట్లూరి కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా ఓ భారీ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. `ప్రేమలు` ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి `విశ్వనాథం అండ్ సన్స్` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలోనే వెంకీ అట్లూరి ఫస్ట్ టైమ్ స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డతో కలిసి పని చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరు కలిసి వర్క్ చేయబోయేది థియేట్రికల్ మూవీ కోసం కాదని, వెబ్ సిరీస్ కోసమని తెలిసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కోసం వీరిద్దరు కలిసి వర్క్ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్టుగా టాలీవుడ్ వర్గాల కథనం.
ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించి సినిమాలు రూపొందించడంతో దిట్ట అని వెంకీ అట్లూరి ఇప్పటికే `లక్కీ భాస్కర్` సినిమాతో నిరూపించుకున్నాడు. లైఫ్‌లో ఓడిపోయిన ఓ ఫ్యామిలీ మ్యాన్ ఎమోషనల్ జర్నీగా ఈ మూవీని వెంకీ అట్లూరి తెరకెక్కించిన తీరు ప్రతి ఒక్కరినీ విశేషం ఆకట్టుకుంది. ఓటీటీలోనూ ఈ మూవీకి మంచి ఆదరణ లభించడం, వెంకీ అట్లూరి టేకింగ్‌కి ప్రశంసలు దక్కడంతో నెట్ ఫ్లిక్స్‌లో వీవర్షిప్ పెరిగిందట. థియేట్రికల్ రిలీజ్‌కు మించి ఈ మూవీకి ఓటీటీలో ఆదరణ దక్కింది.
ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ పెరగడంతో వెంకీ సినిమాలకు నెట్ ఫ్లిక్స్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. దానికి సిద్దూ జొన్నలగడ్డ కూడా తోడవ్వడంతో యూత్ ఆడియన్స్ కూడా ఎట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందని గ్రహించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ క్రేజీ కాంబినేషన్‌లో వెబ్ సిరీస్‌కు ప్లాన్ చేస్తున్నాడు. నెట్‌ఫ్లిక్స్ కూడా సపోర్ట్ చేస్తుండటంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే గత చిత్రాల తరహాలో క్యారెక్టర్ డ్రైవెన్ స్టోరీతో వెంకీ ఇంప్రెస్ చేస్తే సిద్దూ- వెంకీల కాంబోతో రానున్న ఈ సిరీస్ అత్యంత చర్చనీయంశంగా నిలిచే సిరీస్‌గా మారే అవకాశం ఉంది.
