Begin typing your search above and press return to search.

సిద్ధు 'జాక్'.. ఇది మామూలు లాస్ కాదు!

ఇప్పుడు జాక్.. నైజాంలో రూ. కోటి కూడా వసూలు చేయలేదు. దీంతో నైజాం పంపిణీదారు చెల్లించిన అడ్వాన్స్‌ ను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.

By:  Tupaki Desk   |   17 April 2025 7:00 AM IST
సిద్ధు జాక్.. ఇది మామూలు లాస్ కాదు!
X

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. రీసెంట్ గా జాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. రొమాంటిక్ యాక్షన్ జోనర్ లో తెరకెక్కింది. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఆ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానరపై బీవీఎస్ఎన్ ప్రసాద్‌, బాపినీడు నిర్మించారు.

అయితే సిద్ధు.. తన గత రెండు చిత్రాలు టిల్లు, టిల్లు స్క్వేర్ తో మంచి హిట్స్ సొంతం చేసుకోగా.. జాక్ తో డిజాస్టర్ అందుకున్నారు. టిల్లు సిరీస్ సినిమాలు భారీ లాభాలు తెచ్చిపెట్టగా.. జాక్ మాత్రం భారీ నష్టాలు వచ్చేలా చేసింది. ఆడియన్స్ నుంచి మినిమమ్ రెస్పాన్స్ కూడా రాకపోవడంతో సిద్ధు అండ్ టీమ్ కు పెద్ద ఎత్తున నష్టాలు వచ్చినట్లే.

అదే సమయంలో జాక్ థియేట్రికల్ రైట్స్.. ముందస్తు ప్రాతిపదికన తిరిగి చెల్లించే నిబంధనలతో అమ్ముడయ్యాయి. సిద్ధు జొన్నలగడ్డ తన పారితోషికంలో భాగంగా నైజాం హక్కులు తీసుకున్నారు. ఇప్పుడు జాక్.. నైజాంలో రూ. కోటి కూడా వసూలు చేయలేదు. దీంతో నైజాం పంపిణీదారు చెల్లించిన అడ్వాన్స్‌ ను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.

దీంతో ఒక్క నైజాం ఏరియాకు గాను సిద్ధు, జాక్ నిర్మాతలు.. రూ.7 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. అదే సమయంలో ఆంధ్రా, సీడెడ్‌ లోని ఇతర పంపిణీదారులందరూ నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్‌ పై ఒత్తిడి పెంచుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో జాక్ మూవీ నిర్మాతలు.. నిర్మాత భారీ నష్టాలను చవి చూస్తారని క్లియర్ గా తెలుస్తోంది.

అయితే భారీ బడ్జెట్ తో నిర్మించిన జాక్ రిలీజ్ కు ముందు ఆ మొత్తాన్ని బిజినెస్ రూపంలో తిరిగి పొందే విషయంలో మేకర్స్ విఫలమయ్యారనే చెప్పాలి. ఇప్పుడు ఆ విషయంలో ఏం చేయలేకపోయినా.. మూవీ మంచి రిజల్ట్ సంపాదించుకుని ఉంటే.. పరిస్థితి వేరేలే ఉండేది. నిర్మాతలు తమ పెట్టుబడిలను తిరిగి పొందేవారు.

కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అయితే జాక్ నిర్మాతలు రూపొందించిన గత చిత్రం గాంఢీవదారి అర్జున కూడా దారుణంగా నిరాశపరిచింది. అప్పుడు కూడా భారీ నష్టాలు వచ్చాయి. దీంతో ఆ డిస్ట్రిబ్యూటర్లు.. జాక్ రిలీజ్ కు ముందు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. తీరా ఇప్పుడు జాక్ కూడా ఫ్లాప్ అయింది. దీంతో నిర్మాతలకు తీరని నష్టం వచ్చినట్లే.