Begin typing your search above and press return to search.

డైరెక్టర్స్ కి ఇబ్బందిగా మారిన సిద్ధు మల్టీ టాలెంట్..?

జాక్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ క్రమంలో సిద్ధు, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గొడవ పడ్డారన్న విషయాన్ని ప్రస్తావించారు.

By:  Tupaki Desk   |   6 April 2025 3:00 AM IST
డైరెక్టర్స్ కి ఇబ్బందిగా మారిన సిద్ధు మల్టీ టాలెంట్..?
X

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమాల్లోకి వచ్చి చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆ టాలెంట్ తో ఛాన్స్ లు అందుకున్నాడు. ఇక విలన్ గా తన సత్తా చాటిన ఈ యాక్టర్ కృష్ణ అండ్ హిస్ లీలతో హీరోగా మెప్పించాడు. ఇక నెక్స్ట్ డీజే టిల్లుతో తనకంటూ సెపరేట్ క్రేజ్ ఏర్పరచుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. త్వరలో జాక్ గా రాబోతున్నాడు సిద్ధు. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు.

జాక్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ క్రమంలో సిద్ధు, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గొడవ పడ్డారన్న విషయాన్ని ప్రస్తావించారు. సినిమా అవుట్ పుట్ కోసం డైరెక్టర్, హీరో మధ్య గొడవలు కామన్ అని అన్నారు సిద్ధు. గొడవపడటం, కొట్టుకోవడం ఇవన్నీ సినిమా బాగా రావాలని మాత్రమే పర్సనల్ గా ఎలాంటి హేట్ రెడ్ ఉండదని అన్నారు సిద్ధు.

జాక్ లో ఒక సాంగ్ ని డైరెక్టర్ లేకుండా షూట్ చేశారా అన్న దానికి సమాధానంగా డైరెక్టర్ చెప్పబట్టే తాను కొరియోగ్రాఫర్ అలా చేయాల్సి వచ్చిందని అన్నారు సిద్ధు. ఐతే సిద్ధు లోని మల్టీ టాలెంట్ డైరెక్టర్స్ కి ఇబ్బంది కలిగిస్తుందా అంటే ఎప్పుడైనా ఒకరి ప్రతిభ మరొకరికి సపోర్ట్ అవుతుంది తప్ప ఇబ్బంది అనిపించదని అన్నారు. యువ దర్శకులు సిద్ధుతో కథ చెప్పడానికి వెనకడుగు వేస్తారన్న కామెంట్స్ పై అలాంటిది ఏమి ఉండదని అన్నారు సిద్ధు.

జాక్ సినిమా యాక్షన్ సీన్స్ హాలీవుడ్ స్టైల్ లో ఉంటాయని అన్నారు సిద్ధు. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో సూపర్ హిట్ కొట్టలేదు కానీ సినిమాలో పాటలు బాగుంటాయని అన్నారు. సినిమాలో చాలా సందర్భాల్లో సీన్ చెబితే అప్పటికప్పుడు అనుకుని డైలాగ్స్ చెప్పిన విషయాన్ని కూడా చెప్పారు సిద్ధు. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ బాగుందని అన్నారు సిద్ధు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నుంచి వస్తున్న జాక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో మరో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ.