స్టార్ బాయ్‌కి అది బిగ్ ఛాలెంజ్‌గా మారిందిగా!
తెలుగు ప్రేక్షకులు రొటీన్ సినిమాలని అంగీకరించడం లేదు. కోవిడ్ తరువాత నుంచి ప్రేక్షకుల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్న విషయం తలిసిందే.
By: Tupaki Desk | 18 April 2025 6:35 AMతెలుగు ప్రేక్షకులు రొటీన్ సినిమాలని అంగీకరించడం లేదు. కోవిడ్ తరువాత నుంచి ప్రేక్షకుల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్న విషయం తలిసిందే. ప్రపంచ సినిమాపై పట్టు సాధించడం, ఓటీటీల్లో వివిధ భాషలకు సంబంధించిన సినిమాలు, కొత్త తరహా కథలు చూడటంతో రొటీన్ కథలతో వచ్చే మూవీస్‌ని నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు. దీంతో మన వాళ్లు కొత్త కాన్సెప్ట్‌లకే పట్టంకడుతున్నారు. ప్రేక్షకులు ఇంత క్లారిటీతో ఉంటే స్టార్ బాయ్ సిద్దూ మాత్రం ఇందుకు భిన్నంగా అడుగులు వేస్తున్నాడు.
చాలా రోజుల తరువాత `డీజె టిల్లు` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని స్టార్ బాయ్‌గా మారిన సిద్దూ పాపులర్ అయిన టిల్లుని మర్చిపోవడం లేదు. ప్రతి సినిమాకు అదే క్యారెక్టర్‌ని ఫాలో అవుతుండటం పలువురిని షాక్ కు గురి చేస్తోంది. `డీజె` టిల్లు` తరువాత సీక్వెల్ అంటూ చేసిన `టిల్లు స్వ్కేర్` ఫరవాలేదు అనిపించింది. పెద్దగా కథ లేకుండా టిల్లు క్యారెక్టర్‌తో మ్యాజిక్ చేయాలని ప్రయత్నించాడు కానీ ఆ స్థాయిలో మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాడు.
ఆ విషయాన్ని గ్రహించలేకపోయిన సిద్దూ మరోసారి హిట్ కోసం టిల్లు క్యారెక్టర్‌నే నమ్ముకుని `జాక్` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ స్పై యాక్షన్ కామెడీగా రూపొందింది. స్పై థిల్లర్‌ని తన చేతివాటంతో కంగాళీ చేసిన సిద్దూ ఫైనల్ అవుట్ పుట్ వచ్చే సరికి సగం వండేసి వదిలిన వంటకంగా మార్చడంతో ప్రేక్షకులు ఈ ప్రాజెక్ట్‌కు షాక్ ఇచ్చారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎట్రాక్ట్ చేయలేక బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టేసి సిద్దూకు షాక్ ఇచ్చింది.
ఈ సినిమా ఫలితంతో అయినా టిల్లు ఫీవర్‌ని వీడి కొత్త తరహా పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడం తప్ప వేరే గత్యంతరం లేదనే సంకేతాల్ని అందించింది. ఈ మూవీ తరువాత సిద్దూ జొన్నలగడ్డ నటిస్తున్న మూవీ `తెలుసు కదా`. కాస్ట్యూమ్స్ డిజైనర్ నీరజ కోన ఈ మూవీ ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ గత ఏడాది ఆగస్టు లో మొదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ని బట్టి చూస్తుంటే 90వ దశకం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా ఇప్పుడు స్టార్ బాయ్ సిద్దూకు బిగ్ ఛాలెంజ్‌గా మారింది. టిల్లు ఫ్లేవర్ లేకుండా హిట్ కొడతాడా? లేక మళ్లీ అదే ఫార్ములాని నమ్ముకుని కెరీర్‌ని ఇబ్బందుల్లోకి నెట్టుకుంటాడా? అన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.