Begin typing your search above and press return to search.

'అవును మేం కొట్టుకున్నాం'.. సిద్ధు మరోసారి క్లారిటీ!

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో జాక్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 April 2025 10:08 PM IST
అవును మేం కొట్టుకున్నాం.. సిద్ధు మరోసారి క్లారిటీ!
X

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో జాక్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. రొమాంటిక్ యాక్షన్ జోనర్ లో రూపొందిన ఆ మూవీ.. ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కానుంది. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో సిద్ధు, భాస్కర్ కు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని వార్తలు వచ్చాయి.

ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయని, ఒక సాంగ్ షూటింగ్ డైరెక్టర్ లేకుండా జరిగిందని టాక్ వినిపించింది. దీంతో ఆ విషయంపై ఇంటర్వ్యూలో సిద్ధు జొన్నలగడ్డ స్పందించారు. సినిమా విషయంలో క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ రావడం కామన్ అని తెలిపారు. సినిమా కోసమే తిట్టుకున్నామని, తీవ్రంగా చర్చించుకున్నామని చెప్పారు స్టార్ బాయ్.

ఏదైనా సినిమా విషయంలో ఇలాంటివి సహజమని పేర్కొన్నారు. తాము పర్సనల్ రీజన్స్ వల్ల తిట్టుకోలేదని వెల్లడించారు. నార్మల్ గా ఒక్క సోషల్ మీడియా పోస్ట్ వల్ల ఫ్రెండ్స్ మధ్య అభిప్రాయ భేదాలు వస్తుంటాయని అన్నారు. ఇప్పుడు 2 గంటల సినిమాలు చేస్తున్నప్పుడు అలాంటివి జరగడంలో తప్పు లేదని చెప్పారు.

అదే సమయంలో జాక్ హీరోయిన్ విషయం కోసం మాట్లాడారు. ముందు పూజా హెగ్డేని ఫిమేల్ లీడ్ రోల్ కోసం సెలెక్ట్ చేసినట్లు వచ్చిన వార్తలు నిజం కావని తెలిపారు. పూజను తీసుకోవాలనే ఆలోచన లేదని అన్నారు. ముందు నుంచి కూడా వైష్ణవి చైతన్యనే జాక్ మూవీకి గాను హీరోయిన్ గా అనుకున్నట్లు సిద్ధు జొన్నలగడ్డ చెప్పారు.

ఆ తర్వాత టిల్లు స్క్వేర్ కోసం సిద్ధు మాట్లాడారు. ఆ మూవీ చేయడం తనకు ఇష్టం లేదని తెలిపారు. డీజే టిల్లు అప్పుడు తన వద్ద కథ ఉందని, సీక్వెల్ విషయానికొచ్చేసరికి కథ లేదని అన్నారు. కానీ మంచి గుర్తింపు కోసం రెండేళ్ల పాటు వర్క్ చేశామని, సినిమా కూడా అంతే రీతిలో వసూళ్లను సాధించిందని సిద్ధు తెలిపారు.

టిల్లు తర్వాత తనకు ఎన్నో ఛాన్స్ లు వచ్చాయని, వాటికి ఓకే చెబితే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించేవాడినని తెలిపారు. కానీ డబ్బుుల కోసం సినిమాలు చేయడం లేదని చెప్పారు. తన ఫోకస్ అంతా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండడంపైనే ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు జాక్ సూపర్ హిట్ అవ్వడం పక్కా అని అంచనా వేశారు. మరి జాక్ తో సిద్ధు ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.