Begin typing your search above and press return to search.

హౌల్డ్ లో కోహినూర్.. సెట్స్ పైకి బాడాస్.. సిద్ధు నయా మూవీస్!

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. టిల్లు ఫ్రాంచైజీతో వేరే లెవెల్ ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 April 2025 2:00 AM IST
Siddu Jonnalagadda Talks Future Projects
X

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. టిల్లు ఫ్రాంచైజీతో వేరే లెవెల్ ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. తనకంటూ స్పెషల్ క్రేజ్ దక్కించుకున్న ఆయన.. వరుసగా కొత్త మూవీలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. లైనప్ లోకి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను చేర్చుకుంటూ దూసుకెళ్తున్నారని చెప్పాలి.

డీజే టిల్లు మూవీకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ తో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సిద్ధు.. ఇప్పుడు జాక్ మూవీతో మరికొద్ది రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్నారు. రొమాంటిక్ యాక్షన్ జోనర్ లో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఆ సినిమా.. ఏప్రిల్ 10వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది.

అయితే ఇప్పటికే మంచి అంచనాలు నెలకొల్పిన జాక్ ను ఫుల్ గా ప్రమోట్ చేస్తున్నారు సిద్ధు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఒక్కో ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా జాక్ మూవీ విషయంలో డైరెక్టర్, తనకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని తెలిపారు.

అది సినిమా విషయంలో కామన్ అని అన్నారు. ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో తన అప్ కమింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. తాను బాడాస్ అనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ఆ మూవీలో యాక్టర్ రోల్ ను పోషిస్తున్నట్లు చెప్పారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బందులను సినిమా ద్వారా వివరిస్తామని అన్నారు.

రవిశంకర్ పేరెపు దర్శకత్వం వహించిన ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే సిద్ధు జొన్నలగడ్డ ఇప్పటికే కోహినూర్ మూవీ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ మూవీ హోల్డ్ లో ఉందని తెలిపారు. కోహినూర్ పదులు బాడాస్ ను తీస్తున్నట్లు చెప్పారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు, సిద్ధు జొన్నలగడ్డ.. నీరజ కోన దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ "తెలుసు కదా" చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఆ సినిమా 2025లోనే విడుదలవుతుంది. రాశీ ఖన్నా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.