Begin typing your search above and press return to search.

టిల్లు క్యూబ్‌ మల్టీస్టారర్‌ రూమర్‌..!

సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు తో ఒక్కసారిగా యూత్‌ లో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   19 May 2024 6:02 AM GMT
టిల్లు క్యూబ్‌ మల్టీస్టారర్‌ రూమర్‌..!
X

సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు తో ఒక్కసారిగా యూత్‌ లో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. దాన్ని కొనసాగించే విధంగా టిల్లు స్క్వేర్ తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏకంగా వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన టిల్లు స్క్వేర్ సినిమా తో సిద్దు క్రేజ్ మరింతగా పెరిగింది.

టిల్లు ప్రాంచైజీ లో మూడో సినిమాకు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. టిల్లు క్యూబ్‌ అంటూ టైటిల్‌ ను అనౌన్స్ చేసిన యూనిట్‌ సభ్యులు అప్పుడే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ ను షురూ చేశారు అనే టాక్ వినిపిస్తుంది. గత రెండు సినిమాల మాదిరిగానే టిల్లు గాడి మూడో కథ ను కూడా సిద్దు స్వయంగా రాస్తున్నాడని సమాచారం అందుతోంది.

ఈ సమయంలోనే టిల్లు క్యూబ్‌ లో సిద్దు జొన్నలగడ్డ తో పాటు మరో హీరో కూడా ఉంటాడట. కథ లో భాగంగా ఒక యంగ్‌ హీరో గెస్ట్‌ రోల్‌ కి మించి ఉండబోతున్నాడట. ఆ యంగ్‌ హీరో ఎవరు అనేది ఇంకా డిసైడ్‌ చేయలేదు. టిల్లు క్యూబ్‌ కి ఆ హీరో పాత్ర కూడా అత్యంత కీలకంగా ఉంటుందని టాక్‌ వినిపిస్తుంది.

ఇప్పటి వరకు కథ ఫైనల్‌ అవ్వలేదు కానీ మరో హీరో పాత్ర ఉంటుంది అనేది మాత్రం బలంగా వినిపిస్తున్న రూమర్‌. సిద్దు ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదికి టిల్లు క్యూబ్‌ ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఒక సినిమాను, నీరజ కోన దర్శకత్వంలో మరో సినిమా ను చేస్తున్నాడు.

ఇప్పటికే మొదలు పెట్టిన సినిమాలు పూర్తి అయిన తర్వాత టిల్లు క్యూబ్‌ సినిమా ను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. టిల్లు సిరీస్ లో రాబోతున్న మూడో సినిమా తో హ్యాట్రిక్ కొట్టేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మరో హీరో, మల్టీస్టారర్‌ అంటూ వార్తలు వస్తూ మరింతగా అంచనాలు పెంచుతున్నాయి.