Begin typing your search above and press return to search.

టిల్లు క్యూబ్ కాస్త కష్టపడాల్సిందే..!

అయితే టిల్లు స్క్వేర్ 100 కోట్లు తెచ్చినా డీజే టిల్లు రేంజ్ కామెడీ లేదన్న మాట కొందరి నోట వినిపించింది

By:  Tupaki Desk   |   15 April 2024 2:30 PM GMT
టిల్లు క్యూబ్ కాస్త కష్టపడాల్సిందే..!
X

డీజే టిల్లుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ దశాబ్ద కాలంగా చిన్నా చితకా పాత్రలు చేస్తూ అతను పడిన శ్రమ అంతటికి ఒక టర్న్ వచ్చినట్టు అయ్యింది. డీజే టిల్లుతో స్టార్ బోయ్ గా మారిన సిద్ధు జొన్నలగడ్డ ఆ సినిమా సీక్వల్ టిల్లు స్క్వేర్ తో వచ్చి సర్ ప్రైజ్ చేశాడు. టిల్లు స్క్వేర్ సినిమా పై ఉన్న అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉండటంతో 100 కోట్లు వసూళ్లను రాబట్టింది.

అయితే టిల్లు స్క్వేర్ 100 కోట్లు తెచ్చినా డీజే టిల్లు రేంజ్ కామెడీ లేదన్న మాట కొందరి నోట వినిపించింది. సిద్ధు టిల్లు పాత్రలో రఫ్ఫాడించాడని చెప్పడంలో డౌట్ లేదు కానీ ఎక్కడో డీజే టిల్లు లో ఉన్న మ్యాజిక్ టిల్లు స్క్వేర్ లో లేదని అనిపించింది. అయితే టిల్లు స్క్వేర్ లో అనుపమ గ్లామర్ కూడా వన్ ఆఫ్ ది హైలెట్ అని చెప్పొచ్చు. అంతకుముందు వరకు ఉన్న అనుపమ క్లాస్ ఇమేజ్ కు భిన్నంగా ఈ సినిమాలో రెచ్చిపోయింది.

అలా టిల్లు స్క్వేర్ కి యూత్ ఎగబడి టికెట్లు చించేందుకు అనుపమ కూడా ఒక రీజన్ అయ్యింది. ఎలాగోలా టిల్లు స్క్వేర్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో టిల్లు క్యూబ్ కూడా ఉందని చెప్పాడు సిద్ధు జొన్నలగడ్డ. అయితే సిద్ధు ఈజీగా టిల్లు క్యూబ్ అని అనౌన్స్ చేశాడు కానీ అతను చెప్పినంత ఈజీగా అయితే టిల్ల్ క్యూబ్ ఉండే అవకాశం లేదు.

డీజే టిల్లు లో సిద్ధు పాత్ర ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఆ మ్యాజిక్ తో డీజే టిల్లు సూపర్ హిట్ అయ్యింది. టిల్లు స్క్వేర్ లో అది రిపీట్ అయినా కూడా కేవలం సిద్ధు క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. కానీ టిల్లు క్యూబ్ లో కచ్చితంగా టిల్లు క్యారెక్టర్ ఒక్కటే కాదు కథ కథనాలు కూడా గ్రిప్పింగ్ తో ఉండాలి అప్పుడే టిల్లు క్యూబ్ ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉంటుంది. మరి టిల్లు క్యూబ్ తో స్టార్ బోయ్ అదే మన సిద్ధు ఎలాంటి కథతో వస్తాడు.

డీజే టిల్లు తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న సిద్ధు టిల్లు క్యూబ్ కోసం ఎన్నాళ్లు టైం తీసుకుంటాడు అన్నది చూడాలి. టిల్లు క్యూబ్ ఈసారి మాత్రం మరింత బడ్జెట్ తో భారీగా ఉండబోతుందని టాక్. సిద్ధు ఓ పక్క వేరే సినిమాలు చేస్తూనే మరోపక్క ఈ టిల్లు సీరీస్ లను సాధ్యమైనంత వరకు కొనసాగించాలని చూస్తున్నాడని టాక్.