Begin typing your search above and press return to search.

సిద్ధు జాక్ మీద భారీ బెట్..!

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో తన సత్తా చాటిన సిద్ధు జొన్నలగడ్డ నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన 15 ఏళ్లకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు

By:  Tupaki Desk   |   20 April 2024 1:30 PM GMT
సిద్ధు జాక్ మీద భారీ బెట్..!
X

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో తన సత్తా చాటిన సిద్ధు జొన్నలగడ్డ నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన 15 ఏళ్లకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సిద్ధు ఆ తర్వాత విలన్ రోల్స్, సైడ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. కృష్ణ అండ్ హిస్ లీల సినిమాతో ఆడియన్స్ ను మెప్పించిన సిద్ధు డీజే టిల్లుతో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నాడు. టిల్లు హంగామాతో రీసెంట్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది.

కెరీర్ లో ఇప్పుడు సూపర్ ఫాం లో ఉన్న సిద్ధు జొన్నలగడ్డ తన నెక్స్ట్ సినిమాల విషయంలో మరింత ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ చేస్తున్న సినిమా జాక్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది. టిల్లు స్కేవ్ తో 100 కోట్ల మార్క్ అందుకున్న సిద్ధు తన మార్కెట్ ని పెంచుకున్నాడు.

టిల్లు స్క్వేర్ ఎఫెక్ట్ జాక్ సినిమా మీద పడింది. ఈ క్రమంలో సిద్ధు జాక్ సినిమా బడ్జెట్ పెంచినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. టిల్లు స్క్వేర్ రిజల్ట్ చూశాక సిద్ధు మీద ఇంకాస్త బడ్జెట్ పెట్టినా వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు. జాక్ సినిమాకు కూడా బొమ్మరిల్లు భాస్కర్ కు తన సహాయం అందిస్తున్నాడట సిద్ధు.

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో వచ్చిన ఈ క్రేజ్ ను కొనసాగించాలని అనుకుంటున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. జాక్ సినిమా కూడా సిద్ధు మార్క్ హంగామా ఉండబోతుందని టాక్. దీనితో పాటుగా సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాలో నటిస్తున్నాడు. నీరజ కోన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కె.జి.ఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఆడియన్స్ తన మీద పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం తగ్గకుండా తన నెక్స్ట్ సినిమాలు ఉండాలని చూస్తున్నాడు సిద్ధు. అందుకే బడ్జెట్ ఎక్కువ అవుతున్నా అందుకు తగినట్టుగానే కథ కథనాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.

సెట్స్ మీద ఉన్న రెండు సినిమాలే కాదు టిల్లు క్యూబ్ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ లైన్ లో ఉన్నాడు సిద్ధు. టిల్లు రెండు సినిమాల తరహాలోనే టిల్లు క్యూబ్ కూడా అదే రేంజ్ హడావిడి చేయాలని చూస్తున్నాడు. మరి అది ఏ రేంజ్ లో వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.