4 లక్షలకు టైటిల్ కోనేసిన యంగ్ హీరో!
`డిజేటిల్లు` హిట్ ప్రాంచైజీగా మార్కెట్ లో ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 30 March 2025 5:30 PM`డిజేటిల్లు` హిట్ ప్రాంచైజీగా మార్కెట్ లో ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ తెరకెక్కించిన సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. అటుపై ఇదే సినిమాకు సీక్వెల్ గా `టిల్లు స్వ్కేర్` అనౌన్స్ చేయడంతో అంచనాలు పీక్స్కి చేరాయి. అయితే ఈసారి దర్శకుడు మారాడు. రామ్ నాయక్ టిల్లుస్క్వేర్ ని తెరకెక్కించాడు.
ఈ సినిమా ఏకంగా సిద్దును 100 కోట్ల క్లబ్లో కూర్చోబెట్టింది. దీంతో టిల్లు బాబు అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్ గా మారిపోయాడు. ఈ సినిమాకి సీక్వెల్ డిజేటిల్లు 3 కూడా ఉంటుందని అనౌన్స్ చేసారు. అయితే అందుకు ఇంకొంచం సమయం పడుతుంది. గ్యాప్ తీసుకుని పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా అసలు టైటిల్ డీజే టిల్లు కాదని సిద్దు రివీల్ చేసాడు. `నరుడు బ్రతకు నటన` అన్నది ముందు అనుకున్న టైటిల్ అట.
కానీ ఆ టైటిల్ కాస్త పాత ఉందని తమకే అసంతృప్తి ఉండటంతో టైటిల్ మార్చాల్సి వచ్చిందన్నాడు. అయితే `డీజే టిల్లు` టైటిల్ అప్పటికే ఛాంబర్ లో రిజిస్టర్ అయిందట. కానీ తాము రాసుకున్న కథకు ఆ టైటిల్ పక్కాగా యాప్ట్ అవ్వడంతో నాలుగు లక్షలకు అదే టైటిల్ కొనేసినట్లు తెలిపాడు. త్రివిక్రమ్ కూడా ఈ కథ చెప్పినప్పుడు సాధరణ వ్యక్తి కథ అనుకున్నానని...కానీ సినిమా చూసిన తర్వాత అందకు భిన్నమైన సినిమా ఇదని అభిప్రాయపడ్డారుట.
ఇలా టైటిల్ మార్చడం తమకు ఎంతగానో కలిసొచ్చిందన్నాడు. ఈ చిత్రాన్నిసితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. ఈ సంస్థలో నిర్మాణం అంటే ఆ సినిమా కథ కచ్చితంగా త్రివిక్రమ్ కి తెలుస్తుంది. ఆయన కనుసన్నల్లోనే ఆసంస్థ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.